పాకిస్థాన్‌ అప్పులు రూ.58.6 లక్షల కోట్లు

పాకిస్థాన్‌ అప్పులు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌కు 34.1 శాతం పెరిగాయి. ఈ మేరకు డాన్‌ ప్రతిక మంగళవారం కథనం వెలువరించింది.

Published : 07 Jun 2023 04:21 IST

గతేడాదితో పోలిస్తే 34.1% పెరుగుదల

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ అప్పులు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌కు 34.1 శాతం పెరిగాయి. ఈ మేరకు డాన్‌ ప్రతిక మంగళవారం కథనం వెలువరించింది. దేశం అప్పులు మొత్తం రూ.58.6 లక్షల కోట్ల (పాకిస్థాన్‌ రూపాయలు)కు చేరినట్లు తెలిపింది. ఇందులో దేశీయ అప్పులు రూ.36.5 లక్షల కోట్లు కాగా.. విదేశీ అప్పులు రూ.22 లక్షల కోట్లు (37.6%)గా నమోదయ్యాయి. పాకిస్థాన్‌ రుణాలు ప్రతి నెలా 2.6 శాతం చొప్పున పెరుగుతున్నట్లు కథనం పేర్కొంది. దేశీయ అప్పుల్లో మెజారిటీ వాటా పాకిస్థాన్‌ ప్రభుత్వం జారీ చేసిన బాండ్లవే. వీటి వాటా రూ.25 లక్షల కోట్లుగా ఉంది. బాండ్ల జారీ గతేడాదితో పోలిస్తే 31.6 శాతం అధికంగా ఉన్నట్లు పత్రిక పేర్కొంది.దిగుమతుల భారంతో సతమతమవుతున్న పాకిస్థాన్‌ వద్ద ప్రస్తుతం దిగుమతుల బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఒక నెలకు సరిపోయే నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఏప్రిల్‌లో దేశంలో ద్రవ్యోల్బణం 36.4 శాతానికి చేరింది. దక్షిణాసియా దేశాల్లో ఇదే అత్యధికమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు