పాక్‌ మీడియాలో ఇమ్రాన్‌ కనిపించరు.. వినిపించరు

పాకిస్థాన్‌ ప్రభుత్వం పీటీఐ అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ఆంక్షల చట్రంలో బంధిస్తోంది. ఆయన పార్టీపై కఠినచర్యలు తీసుకుంటోంది.

Published : 07 Jun 2023 04:38 IST

ఇస్లామాబాద్‌, లాహోర్‌: పాకిస్థాన్‌ ప్రభుత్వం పీటీఐ అధినేత, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ఆంక్షల చట్రంలో బంధిస్తోంది. ఆయన పార్టీపై కఠినచర్యలు తీసుకుంటోంది. ఇక నుంచి అన్ని ప్రధాన మీడియా సంస్థల ప్రసారాల్లో ఇమ్రాన్‌ కనిపించరు.. పేరు వినిపించదు. మే 9న ఇమ్రాన్‌ అరెస్టు తర్వాత దేశవ్యాప్తంగా చెలరేగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆగ్రహించిన ప్రభుత్వం తీసుకొంటున్న చర్యల్లో ఇదొక భాగమని వినిపిస్తోంది. ఈ మేరకు పాకిస్థాన్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా రెగ్యులేటరీ అథారిటీ అక్కడి మీడియా సంస్థలకు.. ఇమ్రాన్‌ పేరు ప్రస్తావించకుండా ఆదేశాలు ఇచ్చింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని