హైతీలో భూకంపం : నలుగురి మృతి
హైతీలోని దక్షిణ ప్రాంతంలో మంగళవారం వేకువజామున 4.9 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. ప్రకంపనల తీవ్రత కారణంగా ఇళ్లు కూలిన ఘటనల్లో నలుగురు మరణించారని, 36 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.
పోర్ట్ ఔ ప్రిన్స్: హైతీలోని దక్షిణ ప్రాంతంలో మంగళవారం వేకువజామున 4.9 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. ప్రకంపనల తీవ్రత కారణంగా ఇళ్లు కూలిన ఘటనల్లో నలుగురు మరణించారని, 36 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. భూకంపం సమయంలో తీవ్ర భయాందోళనలకు లోనైన అనేక మంది చిన్నారులు అటూఇటూ పరిగెడుతూ తీవ్రంగా గాయపడ్డారని, వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. నైరుతి తీరప్రాంత నగరమైన జెరెమీకి సమీపంలో పది కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా భూవిజ్ఞాన పరిశీలన సంస్థ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.