ఖేర్సన్‌లో కన్నీటి వరద
యుద్ధం అంటే తూటాలు.. ఫిరంగులు.. క్షిపణులు.. జెట్ విమానాలు.. డ్రోన్లే కాదు.. ఇప్పుడిందులోకి డ్యాంలు, వరదనీరు, రిజర్వాయర్లు కూడా వచ్చి చేరాయి.
నోవా కఖోవ్కా డ్యాం పేల్చివేతతో పలు ప్రాంతాలు జలమయం
ఖేర్సన్: యుద్ధం అంటే తూటాలు.. ఫిరంగులు.. క్షిపణులు.. జెట్ విమానాలు.. డ్రోన్లే కాదు.. ఇప్పుడిందులోకి డ్యాంలు, వరదనీరు, రిజర్వాయర్లు కూడా వచ్చి చేరాయి. మంగళవారం తెల్లవారుజామున ఖేర్సన్‌కు 70 కిలోమీటర్ల దూరంలోని నీపర్ నదిపైనున్న నోవా కఖోవ్కా డ్యాం పేల్చివేతతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొత్తమలుపు తీసుకుంది. ఈ పేల్చివేతను యుద్ధ వ్యూహంలో భాగమని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వరదనీరు డ్యాం దిగువనున్న ఖేర్సన్ ప్రాంతంలోని 60 వేల మంది ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. పలు గ్రామాలు, పట్టణాలు ఇంకా వరదనీరులోనే ఉన్నాయి. ఉక్రెయిన్ సైన్యం భారీస్థాయిలో సహాయక చర్యలను ప్రారంభించింది. బోట్లు, ఇతర వాహనాల్లో జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. తాగునీరు ఏర్పాట్లు చేస్తోంది. ఖేర్సన్ నగరంలో పశ్చిమ ప్రాంతం ఉక్రెయిన్ అధీనంలో ఉంది. తూర్పు ప్రాంతాన్ని యుద్ధం ఆరంభంలోనే మాస్కో ఆక్రమించింది. అయితే రష్యా ఆక్రమిత ప్రాంతంలో సహాయక చర్యలు సక్రమంగా జరగడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. 40 వేల మంది ప్రభావితమైన ప్రాంతం నుంచి రష్యా కేవలం 1300 మందిని మాత్రమే తరలించింది. చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు.
పంటలకు భారీ నష్టం
దాదాపు 50 లక్షల హెక్టార్ల భూమి ఈ రిజర్వాయర్ కింద సాగవుతోంది. తాజా వరదనీరుతో పంటలు మొత్తం తుడిచిపెట్టుకుపోయాయి. రానున్న సంవత్సరాల్లో కూడా సాగునీరు లభ్యత కష్టమేనని, ఈ ప్రాంతం ఎడారిగా మారే అవకాశం ఉందని భయాలు వ్యక్తమవుతున్నాయి.
పేల్చింది మీరే.. కాదు మీరే
మరోవైపు డ్యాం పేల్చివేతపై ఉక్రెయిన్, రష్యాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పుతిన్ దళాలు చేసిన పనేనని ఉక్రెయిన్ పేర్కొంటుంటే.. కీవ్ ఉగ్రవాదులే ఈ దారుణ ఘటనకు పాల్పడ్డారని మాస్కో ఆరోపిస్తోంది. తుర్కీయే అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో బుధవారం జరిగిన ఫోన్ సంభాషణలో డ్యాం పేల్చివేతను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కిరాతక చర్యగా అభివర్ణించారు. దీనిపై అంతర్జాతీయ నిపుణుల కమిటీతో విచారణ జరిపించాలని ఎర్డోగాన్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాత్రం డ్యాంను.. మాస్కోనే పేల్చివేసిందని.. రష్యా అధీనంలో ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు కూడా జరగడం లేదని పేర్కొన్నారు.
జర్మనీ వేదిగ్గా.. నాటో భారీ బల ప్రదర్శన!
బెర్లిన్: నాటో చరిత్రలోనే అతి పెద్ద వైమానిక విన్యాసం వచ్చే వారం జర్మనీలో జరగనుంది. ఇందులో 25 దేశాలు పాల్గొంటున్నాయి. కూటమిలో ఏ దేశంపైనైనా దాడి జరిగితే మిగతా నాటో దేశాలు స్పందించే తీరు ఈ విన్యాసాల్లో ప్రధానంగా ఉంటుందని అమెరికా అధికారులు చెబుతున్నారు.‘ఎయిర్ డిఫెండర్ 23’ పేరుతో జరిగే ఈ విన్యాసాల్లో మొత్తం 10 వేల మంది సైనికులు, 250 యుద్ధ విమానాలు పాల్గొంటాయి. ఒక్క అమెరికాయే 2 వేల మంది సిబ్బందిని, 100 విమానాలను పంపుతోంది. ‘‘ఈ విన్యాసాలను పుతిన్ సహా ఏ ప్రపంచ నాయకుడైనా గమనించకపోతే ఆశ్చర్యపోతాను’’ అని జర్మనీలోని అమెరికా రాయబారి యామి గట్మన్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Team India: భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్..
-
Vijay Deverakonda: ఆ బ్రాండ్‌కు విజయ్ దేవరకొండ బై.. ఈసారి అంతకుమించి!
-
Mohajer-10: 2 వేల కి.మీల దూరం.. 24 గంటలు గాల్లోనే.. సరికొత్త డ్రోన్లు ప్రదర్శించిన ఇరాన్
-
Vande Bharat Express: 9 రైళ్లు ఒకేసారి ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల నుంచి 2.. ఆగే స్టేషన్లు ఇవే..!
-
10 Downing Street: బ్రిటన్ ప్రధాని నివాసంలో.. శునకం-పిల్లి కొట్లాట!
-
Chiru 157: చిరంజీవిని అలా చూపించాలనుకుంటున్నా: దర్శకుడు వశిష్ఠ