ఫ్రాన్స్‌లో చిన్నారులపై దాడి

ఫ్రాన్స్‌లోని అనసీ అనే పట్టణంలో ఓ ఉన్మాది కత్తితో స్వైరవిహారం చేశాడు. నలుగురు చిన్నారులను, ఇద్దరు పెద్దలను దారుణంగా గాయపరిచాడు.

Published : 09 Jun 2023 03:56 IST

పారిస్‌: ఫ్రాన్స్‌లోని అనసీ అనే పట్టణంలో ఓ ఉన్మాది కత్తితో స్వైరవిహారం చేశాడు. నలుగురు చిన్నారులను, ఇద్దరు పెద్దలను దారుణంగా గాయపరిచాడు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ పేర్కొన్నారు. ఇది దేశాన్ని దిగ్భ్రాంతిపరిచిందన్నారు. బాధితుల్లో నలుగురి చిన్నారుల వయసు 22 నెలల నుంచి మూడేళ్ల లోపే ఉందని వివరించారు. దుండగుడు వీరిని పలుమార్లు కత్తితో పొడిచాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చిన్నారులు ఒక పార్కులో ఉండగా వారిపై దాడి జరిగినట్లు అధికారులు వెల్లడించారు. దాడికి పాల్పడిన సిరియాకు చెందిన 31 ఏళ్ల శరణార్థిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు