మోదీ పర్యటనతో బంధం బలోపేతం

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 22 నుంచి అమెరికాలో నిర్వహించనున్న పర్యటన ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని శ్వేతసౌధం పేర్కొంది.

Published : 09 Jun 2023 05:29 IST

రక్షణ రంగంలో భాగస్వామ్యం మెరుగవుతుంది
శ్వేతసౌధం ఆశాభావం

వాషింగ్టన్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 22 నుంచి అమెరికాలో నిర్వహించనున్న పర్యటన ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని శ్వేతసౌధం పేర్కొంది. రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మెరుగుపరచుకునేందుకు ఈ పర్యటన దోహదం చేస్తుందని బుధవారం ఒక ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేసింది. ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని వెల్లడించింది. ఇరుదేశాల అభివృద్ధి, సాంకేతికత, వాణిజ్యం, పరిశ్రమలు, రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాల గురించి ఈ పర్యటనలో ఇరు దేశాధినేతలూ చర్చించనున్నట్లు తెలిపింది. ప్రధానంగా ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భద్రత, రక్షణ రంగంలో వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్యాన్ని మెరుగుపరచుకునేందుకు కీలక చర్చలు జరుగుతాయని తెలిపింది. అమెరికా నలుమూలల నుంచి తరలివచ్చే భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ఈ నెల 23న మోదీ ప్రసంగిస్తారు. భారతదేశ ప్రగతి గాథలో భారత సంతతివారి పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తారని భారతీయ అమెరికన్‌ సంఘ నాయకుడు డాక్టర్‌ భారత్‌ బరాయ్‌ బుధవారం వివరించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు