పార్లమెంట్‌లో బిడ్డకు పాలిచ్చిన ఇటలీ ఎంపీ

ఇటలీ పార్లమెంటులో అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. పార్లమెంటేరియన్‌ గిల్దా స్పోర్టియెల్లో ఓవైపు వృత్తిగత బాధ్యతలు నిర్వహిస్తూనే.. మరోవైపు మాతృత్వాన్ని ఆస్వాదించారు.

Published : 09 Jun 2023 05:29 IST

రోమ్‌: ఇటలీ పార్లమెంటులో అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. పార్లమెంటేరియన్‌ గిల్దా స్పోర్టియెల్లో ఓవైపు వృత్తిగత బాధ్యతలు నిర్వహిస్తూనే.. మరోవైపు మాతృత్వాన్ని ఆస్వాదించారు. బుధవారం పార్లమెంటులో ఒక బిల్లుకు సంబంధించిన ఓటింగులో పాల్గొన్న గిల్దా.. ఆ తర్వాత వెనుక బెంచీలకు వెళ్లి తన బిడ్డకు పాలుపట్టారు. మాతృత్వం వల్ల విధుల నిర్వహణలో మహిళలు వెనకడుగు వేయకూడదనే సందేశం చాటేలా గిల్దా వ్యవహరించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. పురుషాధిక్య ఇటలీ సమాజ పార్లమెంటులో ఆమె తీసుకున్న నిర్ణయాన్ని స్పీకర్‌ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ప్రశంసించారు. ఫైవ్‌స్టార్‌ మువ్‌మెంట్‌ పార్టీ సభ్యురాలైన గిల్దా పార్లమెంటు సమావేశాల సమయంలో మహిళలు తమ పిల్లలకు పాలిచ్చే నిబంధన తీసుకురావడం కోసం పోరాడి విజయం సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని