అసాంజేకు బ్రిటన్‌ కోర్టులో ఎదురుదెబ్బ

వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జులియన్‌ అసాంజేకు బ్రిటన్‌ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

Published : 10 Jun 2023 05:22 IST

లండన్‌: వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జులియన్‌ అసాంజేకు బ్రిటన్‌ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనను అమెరికాకు అప్పగించేందుకు వీలుగా బ్రిటన్‌ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు జస్టిస్‌ జొనాథన్‌ స్విఫ్ట్‌ తిరస్కరించారు. రహస్య దౌత్య, సైనిక పత్రాలను వెల్లడించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న 51 ఏళ్ల అసాంజేపై అమెరికా గూఢచర్యం కింద 17 అభియోగాలు నమోదు చేసింది. అగ్రరాజ్యానికి అప్పగిస్తే వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు శాశ్వతంగా జైలులోనే మగ్గిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. కోర్టు తీర్పుపై అప్పీల్‌ చేస్తామని అసాంజే భార్య స్టెల్లా వెల్లడించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు