నగరాల్లో నిత్యకృత్యంగా వాయు కాలుష్యం

కెనడాలో చెలరేగిన కార్చిచ్చు వల్ల అమెరికాలోని పలు నగరాల్లో దట్టమైన పొగ ఆవరించి, ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

Published : 10 Jun 2023 05:22 IST

వాషింగ్టన్‌: కెనడాలో చెలరేగిన కార్చిచ్చు వల్ల అమెరికాలోని పలు నగరాల్లో దట్టమైన పొగ ఆవరించి, ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయితే ప్రపంచంలో అనేక నగరాల్లో ఇది నిత్యకృత్యమని నిపుణులు చెబుతున్నారు. వారు ప్రమాదకరస్థాయిలో కలుషితమైన గాలిని పీలుస్తున్నారని పేర్కొన్నారు. దాదాపుగా అన్ని దేశాల్లోనూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్దేశించిన పరిమితులకు మించి కలుషిత గాలినే జనం పీలుస్తున్నారు. ఎక్కువకాలం పాటు అది కొనసాగడం ప్రమాదకరం. కొత్తగా పారిశ్రామికీరణకు దిగుతున్న వర్ధమాన దేశాల్లో ఈ పోకడ ఎక్కువగా ఉంది. 2019లో వాయు కాలుష్యం కారణంగా ఆ ప్రాంతాల్లో 42 లక్షల మరణాలు చోటుచేసుకున్నట్లు డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. గాల్లో హానికర సూక్ష్మరేణువులు (పార్టిక్యులేట్‌ మ్యాటర్‌) ఎక్కువగా ఉన్న 10నగరాల్లో 9.. ఆసియాలోనే ఉన్నాయని తేలింది. వాటిలో భారత్‌లో ఆరు నగరాలు ఉన్నట్లు ఐక్యూఎయిర్‌ అనే సంస్థ గత ఏడాది పేర్కొంది. తీవ్ర పొగ అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేసిన గురువారం రోజు కూడా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కాలుష్య నగరంగా దిల్లీ నిలిచింది. అనేక ఆఫ్రికా దేశాల్లోనూ ఇదే పరిస్థితి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని