రష్యాలో మళ్లీ డ్రోన్ దాడి
రష్యాపై డ్రోన్ దాడుల పరంపర కొనసాగుతోంది. నైరుతి రష్యాలోని వొరొనెజ్ నగరంలో ఓ ఎత్తయిన నివాస భవనంపైకి తాజాగా డ్రోన్ దూసుకొచ్చింది.
ముగ్గురికి గాయాలు
కీవ్: రష్యాపై డ్రోన్ దాడుల పరంపర కొనసాగుతోంది. నైరుతి రష్యాలోని వొరొనెజ్ నగరంలో ఓ ఎత్తయిన నివాస భవనంపైకి తాజాగా డ్రోన్ దూసుకొచ్చింది. ఈ ఘటనలో భవనం దెబ్బతింది. కిటీకీల అద్దాలు పగిలిపోయాయి. ఆ గాజు పెంకులు గుచ్చుకోవడంతో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు.
పేల్చింది యుద్ధట్యాంకును కాదు.. ట్రాక్టర్‌ను!
ఉక్రెయిన్ వినియోగిస్తున్న 8 అత్యాధునిక లియోపార్డ్ యుద్ధట్యాంకులను పేల్చేశామంటూ రష్యా ఇటీవల చేసిన ప్రకటనలో వాస్తవం లేదని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్యాంకుల కూల్చివేతకు సంబంధించి రష్యా విడుదల చేసిన ఓ వీడియోనే ఇందుకు కారణంగా వారు చూపిస్తున్నారు. కేఏ-52 ఎలిగేటర్ ఎటాక్ హెలికాప్టర్ నుంచి ట్యాంకుపైకి క్షిపణిని ప్రయోగించినట్లు మాస్కో తెలిపింది. అయితే- అందులో పేలిపోయినది యుద్ధట్యాంకు కాదని, కేవలం సాధారణ ట్రాక్టర్ అని వీడియో విశ్లేషణలో తేలిందని అమెరికా నిపుణులు వెల్లడించారు.
వచ్చే నెలలోనే బెలారస్‌లో వ్యూహాత్మక అణ్వాయుధాల మోహరింపు: పుతిన్
తమ పొరుగు దేశమైన బెలారస్‌లో వచ్చే నెలలోనే వ్యూహాత్మక అణ్వాయుధాలను మోహరించనున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకోతో శుక్రవారం భేటీ అయిన అనంతరం ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. అణ్వాయుధాలను ఉంచేందుకు అవసరమైన నిర్మాణాల ఏర్పాటు జులై 7-8 తేదీల కల్లా పూర్తవుతుందని చెప్పారు. ఆ వెంటనే ఆయుధాల తరలింపు ప్రక్రియను ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
ఉక్రెయిన్‌కు అమెరికా 210 కోట్ల డాలర్ల సైనిక సాయం
ఉక్రెయిన్‌కు దీర్ఘకాల ఆయుధ సాయం కింద అదనంగా 210 కోట్ల డాలర్లను అందించనున్నట్లు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ శుక్రవారం ప్రకటించింది. దీనికింద మరిన్ని పేట్రియాట్ క్షిపణులు, హాక్ గగనతల రక్షణ వ్యవస్థ, క్షిపణులు, చిన్నపాటి ప్యూమా డ్రోన్ల కొనుగోలుకు నిధులు అందుతాయి. లేజర్ గైడెడ్ రాకెట్లు, శతఘ్ని గుళ్లను సమకూర్చుకోవడానికి, శిక్షణ తదితర అవసరాలకూ ఈ సొమ్మును వెచ్చిస్తారు.
* రష్యాకు వ్యతిరేకంగా దాఖలైన ఊచకోత కేసులో ఉక్రెయిన్‌కు మద్దతిచ్చేందుకు తమను అనుమతించాలన్న 32 దేశాల విజ్ఞప్తిని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) అనుమతిచ్చింది. ఒక దేశం చేసిన ఫిర్యాదును ఇన్ని దేశాలు సమర్థించడం ఈ కోర్టు చరిత్రలో ఇదే మొదటిసారి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/09/2023)
-
Vizag: సిగరెట్ కోసం స్నేహితుడినే హతమార్చారు!
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Hyderabad: ప్రముఖ హోమియో వైద్య నిపుణుడు సోహన్‌సింగ్ జోషి మృతి
-
Chandrababu Arrest: చంద్రబాబుకు మద్దతుగా కూకట్‌పల్లిలో నిరసనలు
-
Missing Children: తొమ్మిదేళ్లలో 4.46 లక్షల చిన్నారుల ఆచూకీ లభ్యం: స్మృతీ ఇరానీ