Diabetes: మధుమేహ మాత్రతో లాంగ్‌ కొవిడ్‌కు కళ్లెం

సురక్షితమైనదిగా గుర్తింపు పొందిన మధుమేహ ఔషధం మెట్‌ఫార్మిన్‌ను రెండు వారాలు తీసుకోవడం వల్ల తదుపరి 10 నెలల్లో దీర్ఘకాల కొవిడ్‌ (లాంగ్‌ కొవిడ్‌-19) ముప్పు 40 శాతం మేర తగ్గుతుందని వెల్లడైంది.

Published : 11 Jun 2023 07:53 IST

దిల్లీ: సురక్షితమైనదిగా గుర్తింపు పొందిన మధుమేహ ఔషధం మెట్‌ఫార్మిన్‌ను రెండు వారాలు తీసుకోవడం వల్ల తదుపరి 10 నెలల్లో దీర్ఘకాల కొవిడ్‌ (లాంగ్‌ కొవిడ్‌-19) ముప్పు 40 శాతం మేర తగ్గుతుందని వెల్లడైంది. ఈ పరిశోధన వివరాలు ప్రముఖ వైద్య పత్రిక ‘ద లాన్సెట్‌ ఇన్‌ఫెక్షస్‌ డిసీజెస్‌’లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనం కోసం.. ఊబకాయం కారణంగా తీవ్ర కొవిడ్‌ ముప్పు పొంచి ఉన్న 30 ఏళ్లు పైబడిన వారిని ఎంచుకున్నారు. వీరిలో కొందరికి మెట్‌ఫార్మిన్‌ను, మరికొందరికి ఉత్తుత్తి మందును ఇచ్చారు. ఆ తర్వాత 10 నెలల పాటు వీరిని శాస్త్రవేత్తలు గమనించారు. 30 రోజులకోసారి ప్రశ్నావళిని పంపి, వారి నుంచి వివరాలు సేకరించారు. ఉత్తుత్తి మందును పొందిన వారితో పోలిస్తే మెట్‌ఫార్మిన్‌ను తీసుకున్నవారిలో చాలా తక్కువ మంది లాంగ్‌ కొవిడ్‌ బారినపడినట్లు గుర్తించారు. దీనివల్ల అత్యవసర వైద్య విభాగంలో చేరాల్సిన అవసరం కూడా 40 శాతం మేర తగ్గుతుందని వెల్లడైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని