యూకే వీసా ఫీజుల పెంపు!

విదేశీయుల వీసా ఫీజులతోపాటు జాతీయ ఆరోగ్య సేవకు (ఎన్‌హెచ్‌ఎస్‌) వారు చెల్లించే సర్‌ఛార్జిని పెంచుతున్నట్లు బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ తెలిపారు.

Updated : 14 Jul 2023 06:00 IST

లండన్‌: విదేశీయుల వీసా ఫీజులతోపాటు జాతీయ ఆరోగ్య సేవకు (ఎన్‌హెచ్‌ఎస్‌) వారు చెల్లించే సర్‌ఛార్జిని పెంచుతున్నట్లు బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ తెలిపారు. దేశంలో ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు వేతనాల పెంపు కారణంగా పడే భారాన్ని దీని ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఉపాధ్యాయులు, పోలీసులు, జూనియర్‌ డాక్టర్లు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు 5శాతం నుంచి 7శాతందాకా వేతనాలను పెంచాలని స్వతంత్ర రివ్యూ కమిటీ ఒత్తిడికి తలొగ్గిన సునాక్‌ ఆ భారాన్ని విదేశీయులపై వేయాలని నిర్ణయించడం గమనార్హం. ప్రజల నుంచి పన్నుల రూపంలో వచ్చే డబ్బును వేతనాలకు ఖర్చు చేయడం తనకు ఇష్టం లేదని, అందుకే వీసా ఫీజులను, ఇమ్మిగ్రేషన్‌ హెల్త్‌ సర్‌ఛార్జిని పెంచాలని నిర్ణయించామని సునాక్‌ తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు