భారత సంతతి బ్రిటన్‌ బాలికకు ప్రతిష్ఠాత్మక పురస్కారం

భారత సంతతికి చెందిన ఏడు సంవత్సరాల బ్రిటన్‌ బాలిక మోక్షారాయ్‌ ప్రతిష్ఠాత్మక బ్రిటన్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ పాయింట్స్‌ ఆఫ్‌ లైట్‌ అవార్డును గెలుచుకుంది.

Updated : 20 Jul 2023 06:05 IST

లండన్‌: భారత సంతతికి చెందిన ఏడు సంవత్సరాల బ్రిటన్‌ బాలిక మోక్షారాయ్‌ ప్రతిష్ఠాత్మక బ్రిటన్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ పాయింట్స్‌ ఆఫ్‌ లైట్‌ అవార్డును గెలుచుకుంది. మైక్రోప్లాస్టిక్‌ కాలుష్యానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి చేపట్టిన కార్యక్రమం కోసం ఆమె మూడేళ్ల ప్రాయం నుంచే స్వచ్ఛందంగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె సేవలకు గుర్తింపుగా బ్రిటన్‌ ఉపప్రధాని ఆలివర్‌ డౌడెన్‌ గతవారం బాలికకు అవార్డును అందజేశారు. ఆర్థిక సహకారం అవసరమైన చిన్నారులను ఆదుకునేందుకు నిధుల సేకరణ సహా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై పలు కార్యక్రమాలను చేపట్టడం ద్వారా మోక్ష గుర్తింపు పొందారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు