భారతీయుల గ్రీన్‌కార్డు దరఖాస్తులకు ప్రాధాన్యమివ్వండి: బైడెన్ సర్కారును కోరిన అమెరికా శాసనకర్తలు
అమెరికాలో శాశ్వత నివాసానికి వీలు కల్పించే గ్రీన్‌కార్డుల కోసం భారతీయుల నుంచి వచ్చే దరఖాస్తులకు ప్రాధాన్యమిచ్చి పరిష్కరించాలని అమెరికా కాంగ్రెస్ సభ్యులు కోరారు.
వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాసానికి వీలు కల్పించే గ్రీన్‌కార్డుల కోసం భారతీయుల నుంచి వచ్చే దరఖాస్తులకు ప్రాధాన్యమిచ్చి పరిష్కరించాలని అమెరికా కాంగ్రెస్ సభ్యులు కోరారు. ఈ మేరకు రాజా కృష్ణమూర్తి, లేరీ బుక్‌షాన్ నేతృత్వంలో 56 మంది శాసనకర్తలు జో బైడెన్ సర్కారుకు లేఖ రాశారు. ప్రస్తుతం నిరీక్షణలో ఉన్న భారతీయులకు గ్రీన్‌కార్డులు రావాలంటే 195 ఏళ్లు నిరీక్షించాల్సి వస్తుందన్న విషయాన్ని వారు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దీనివల్ల దరఖాస్తుదారుల్లో నిరంతర అనిశ్చితి కనిపిస్తోందన్నారు. అత్యున్నత నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగ ప్రాతిపదికన ఇచ్చే వీసాల విషయంలో కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లి ఉపశమనం కల్పించాలని విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ను, అంతర్గత భద్రత విభాగాన్ని వారు కోరారు. చట్టబద్ధంగా అమెరికాకు రావాలనుకుంటున్నవారికి ఊరట ఇవ్వాలని కోరారు. చట్టబద్ధ వలస వ్యవస్థలో అధికార యంత్రాంగ అలసత్వం వల్ల వీసాలు పెండింగులో పడిపోయి.. ఉద్యోగాలు మారాలనుకున్నవారికి, వ్యాపారాలు ప్రారంభించేవారికి, అపరాధ రుసుం లేకుండా విదేశాలకు ప్రయాణించేవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు.
కోటా విధానంతోనే ఇబ్బందులు
దేశాలవారీగా గరిష్ఠంగా ఏడు శాతం కోటాను అమలు చేస్తున్న విధానం వల్ల భారత్ వంటి దేశాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దశాబ్దాలపాటు ఎదురుచూపులు తప్పడం లేదని ‘ఫౌండేషన్ ఫర్ ఇండియా, ఇండియన్ డయాస్పొరా స్టడీస్’ (ఎఫ్‌ఐఐడీఎస్ యూఎస్‌ఏ) కూడా విడిగా జో బైడెన్‌కు విజ్ఞప్తి చేసింది. గ్రీన్‌కార్డు రాకపోవడం వల్ల యజమానుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితిలో దాదాపు 10 లక్షల మంది ఉన్నారని ‘ఇమ్మిగ్రేషన్ వాయిస్’ అధ్యక్షుడు అమన్ కపూర్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్
-
Law Commission: ‘జమిలి’ నివేదికపై కసరత్తు జరుగుతోంది.. లా కమిషన్ ఛైర్మన్
-
IND vs AUS: టీమ్ఇండియా ఆలౌట్.. మూడో వన్డేలో ఆస్ట్రేలియా విజయం