స్వేచ్ఛా వాయువులు పీల్చుకుందామని వెళ్లి.. తేనెటీగలకు చిక్కాడు..!

తన దేశంలోని విధానాలు నచ్చని వ్యక్తి మరో దేశంలో ఆశ్రయం పొందాలనుకున్నాడు. కానీ చివరకు అతడి ప్రయత్నం బెడిసి కొట్టింది. 

Published : 01 Aug 2023 18:00 IST

బీజింగ్‌: స్వేచ్ఛావాయువులు పీల్చుకోవాలని సొంత దేశం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తికి అనుకోని గండం ఎదురైంది. ప్రాణాలు లెక్కచేయకుండా 10 గంటల పాటు జలసంధిని ఈదినా ఫలితం లేకుండాపోయింది. కారణమేమిటంటే..?

స్వేచ్ఛకోసం చైనా(China)కు చెందిన 40 ఏళ్ల వ్యక్తి ఫుజియన్‌ ప్రావిన్స్ నుంచి తైవాన్‌(Taiwan)లోని మట్సు ఐలాండ్‌కు వెళ్లాలనుకున్నాడు. ఇందుకోసం సముద్రంలో ఈదుకుంటూ బయలుదేరాడు. మార్గమధ్యంలో తేనెటీగల వల్ల అతడి ప్రయత్నం వృథా అయింది. వాటి దాడిలో అతడు గాయపడటంతో ఇతర పర్యాటకుల సహాయం కోరాల్సి వచ్చింది. వారు అతడి గురించి అధికారులకు సమాచారం ఇచ్చారు. అతడు చైనా నుంచి అక్రమంగా వచ్చిన వ్యక్తి అని గుర్తించి.. కస్టడీలోకి తీసుకున్నారు. తర్వాత బీగాన్‌ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ అతడికి చికిత్స అందించారు. అతడు తన వెంట డ్రై ఫుడ్స్‌, దుస్తులు, ఔషధాలు, కొంత నగదు తెచ్చుకున్నాడు. చైనా నుంచి స్వేచ్ఛ కోసం తాను ప్రమాదకర ప్రయాణాన్ని చేశానని అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం అతడు విచారణ ఎదుర్కొంటున్నాడు.

ఆస్ట్రేలియా తీరంలో దొరికిన వింత వస్తువుపై క్లారిటీ!

2020లోనూ ఇదే తరహా ఘటన జరిగింది. చైనాలో ఉన్న రాజకీయ పరిస్థితులు నచ్చని ఓ వ్యక్తి.. తైవాన్‌లోని కిన్మెన్‌ ఐలాండ్‌కు చేరుకునేందుకు ఏడు గంటల పాటు ఈదుకుంటూ వచ్చాడు. కానీ చివరకు పోలీసులకు చిక్కాడు. అక్రమంగా తైవాన్‌లోకి ప్రవేశించినందుకు అధికారులు అతడిని అరెస్టు చేశారు. గతంలో ఇవే తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు