హిజాబ్‌ను కాదంటే పదేళ్ల జైలుశిక్ష

ఇస్లాం సంప్రదాయం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్‌ (ముఖ ఆచ్ఛాదన) ధరించేందుకు విముఖత వ్యక్తం చేసే మహిళలకు, ఇందుకు మద్దతు తెలిపేవారికి భారీ శిక్షలు విధించేలా ఇరాన్‌ పార్లమెంటు బిల్లును ఆమోదించింది.

Published : 22 Sep 2023 06:09 IST

ఇరాన్‌ పార్లమెంటులో బిల్లు ఆమోదం

దుబాయ్‌: ఇస్లాం సంప్రదాయం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్‌ (ముఖ ఆచ్ఛాదన) ధరించేందుకు విముఖత వ్యక్తం చేసే మహిళలకు, ఇందుకు మద్దతు తెలిపేవారికి భారీ శిక్షలు విధించేలా ఇరాన్‌ పార్లమెంటు బిల్లును ఆమోదించింది. దీని ప్రకారం గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలుశిక్ష విధించే అవకాశముంది. హిజాబ్‌ ధరించని మహిళలకు సేవలందించే వ్యాపారులకు సైతం ఈ చట్టం వర్తిస్తుంది. గతేడాది హిజాబ్‌ వివాదం కారణంగా పోలీస్‌ కస్టడీలో మృతిచెందిన మహసా అమిని (22) ఘటనకు సరిగ్గా ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఇరాన్‌ ఈ బిల్లును తీసుకురావడం గమనార్హం. ఈ బిల్లు రాజ్యాంగ పరిరక్షకులుగా పనిచేసే మతాధికార సంస్థ గార్డియన్‌ కౌన్సిల్‌ అంగీకారం పొందాల్సి ఉంది. ఈ అంగీకారం కూడా పొందాక ప్రాథమికంగా మూడేళ్లపాటు బిల్లు అమలులోకి వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని