మనిషికి పంది గుండె.. రెండోరోజుకే చలోక్తులతో హుషారుగా ఉన్న రోగి!

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మేరీలాండ్‌ వైద్యులు మరోసారి కీలకమైన అవయవమార్పిడి శస్త్ర చికిత్స చేశారు.

Updated : 24 Sep 2023 07:07 IST

వాషింగ్టన్‌: అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మేరీలాండ్‌ వైద్యులు మరోసారి కీలకమైన అవయవమార్పిడి శస్త్ర చికిత్స చేశారు. మరణం ముప్పును ఎదుర్కొంటున్న 58 ఏళ్ల వ్యక్తిని కాపాడేందుకు చివరి ప్రయత్నంగా.. జన్యు మార్పిడి చేసిన పంది గుండెను అమర్చారు. ఈ శస్త్రచికిత్స జరిగిన 2 రోజులకు ఆ వ్యక్తి సరదాగా జోకులు వేస్తున్నాడని వైద్యులు తెలిపారు. కుర్చీలోనూ కూర్చోగలిగాడని చెప్పారు. రానున్న కొన్ని వారాలు అత్యంత క్లిష్టమైనవని పేర్కొన్నారు. ఆయితే, ఆయన ప్రస్తుతం స్పందిస్తున్న తీరుతో ఆశ్చర్యానికి గురైనట్లు వైద్యులు పేర్కొన్నారు. అనారోగ్య కారణాలు, హార్ట్‌ ఫెయిల్యూర్‌ కారణంగా సంప్రదాయ పద్ధతిలో గుండె మార్పిడి కుదరకపోవడం వల్ల పంది గుండెను అమర్చినట్లు వైద్యులు వివరించారు. గత ఏడాది ఇదే వర్సిటీ వైద్యుల బృందం ప్రపంచంలోనే తొలిసారిగా జన్యుపరంగా మార్పిడి చేసిన పంది గుండెను డేవిడ్‌ బెన్నెట్‌ అనే వ్యక్తికి అమర్చింది. అయితే చికిత్స జరిగిన రెండు నెలల తర్వాత అతడు ప్రాణాలు కోల్పోయాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు