వివేక్‌ రామస్వామితో డిన్నర్‌ అవకాశం

రిపబ్లికన్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో నిలిచిన వివేక్‌ రామస్వామి ఎన్నికల ప్రచారానికి నిధుల సేకరణ నిమిత్తం పలువురు సిలికాన్‌ వ్యాలీ వ్యాపారవేత్తలు ఓ ప్రత్యేక కార్యక్రమంతో ముందుకొచ్చారు.

Published : 24 Sep 2023 05:27 IST

ఒక్కొక్కరికి 50 వేల డాలర్ల పైమాటే

వాషింగ్టన్‌: రిపబ్లికన్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో నిలిచిన వివేక్‌ రామస్వామి ఎన్నికల ప్రచారానికి నిధుల సేకరణ నిమిత్తం పలువురు సిలికాన్‌ వ్యాలీ వ్యాపారవేత్తలు ఓ ప్రత్యేక కార్యక్రమంతో ముందుకొచ్చారు. వివేక్‌ ప్రత్యేక అతిథిగా ఈ నెల 29న ఓ విందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు 50 వేల డాలర్లు (సుమారు రూ.41 లక్షలు) ఆపైనే చెల్లించాల్సి ఉంటుందట. శాన్‌ ఫ్రాన్సిస్కోలోని సోషల్‌ క్యాపిటల్‌ సంస్థ సీఈవో చామాత్‌ పలిహపిటియా నివాసంలో ఈ విందు నిర్వహించనున్నారు. 10 లక్షల డాలర్ల సేకరణే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని