రాత్రివేళ రెండేళ్ల పాప అదృశ్యం.. డ్రోన్లు, జాగిలాలతో పోలీసుల జల్లెడ

అమెరికాలోని మిషిగన్‌కు చెందిన రెండేళ్ల చిన్నారి థియా చేజ్‌ రాత్రి సమయంలో అదృశ్యం కావడంతో కుటుంబసభ్యులు కంగారుపడిపోయారు.

Updated : 24 Sep 2023 08:17 IST

వాషింగ్టన్‌: అమెరికాలోని మిషిగన్‌కు చెందిన రెండేళ్ల చిన్నారి థియా చేజ్‌ రాత్రి సమయంలో అదృశ్యం కావడంతో కుటుంబసభ్యులు కంగారుపడిపోయారు. పోలీసులు ఆమె జాడ కోసం డ్రోన్లు, జాగిలాలతో ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. గత బుధవారం రాత్రి పెంపుడు శునకాలతో ఆడుకొంటూ థియా ఇంటి నుంచి బయటకు వెళ్లింది. స్థానికులతో కలిసి అందరూ పాప జాడ కోసం చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో గాలించారు. డ్రోన్లు, పోలీసు జాగిలాలతో వెదికినా ఆచూకీ దొరకకపోవడంతో కంగారు పడ్డారు. అర్ధరాత్రి సమయంలో పోలీసులకు తారసపడిన ఓ వ్యక్తి.. కుక్కను తలదిండుగా పెట్టుకొని ఓ చిన్నారి నిద్రిస్తున్న దృశ్యాన్ని చూసినట్లు సమాచారం ఇచ్చాడు. ఆ ఇంటికి మూడు మైళ్ల దూరాన అడవిలో.. రెండు పెంపుడు శునకాల్లో ఒకటి చిన్నారికి తలగడగా ఉండగా.. మరొకటి ఆమెను కాపలా కాస్తూ కనిపించిన దృశ్యాన్ని చూసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు