ట్రంప్‌ కంటే బైడెన్‌ వెనుకంజ

వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల కోసం అమెరికాలో ఇప్పటికే పార్టీల ప్రచారం ఊపందుకుంది. రిపబ్లికన్‌ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు తిరుగులేదని తెలుస్తోంది.

Published : 26 Sep 2023 05:45 IST

తాజా సర్వేలో వెల్లడి 

వాషింగ్టన్‌: వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల కోసం అమెరికాలో ఇప్పటికే పార్టీల ప్రచారం ఊపందుకుంది. రిపబ్లికన్‌ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు తిరుగులేదని తెలుస్తోంది. తన పార్టీలోనే కాకుండా ప్రత్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ కంటే కూడా ఆయనే ముందు వరుసలో ఉన్నట్లు తాజా సర్వే ఒకటి వెల్లడించింది. బైడెన్‌ కంటే ట్రంప్‌ దాదాపు 9 పాయింట్లు ముందున్నట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌, ఏబీసీ న్యూస్‌ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ సర్వేలో ట్రంప్‌నకు 51 పాయింట్లు రాగా.. బైడెన్‌కు 42 వచ్చాయి. మరోసారి అధ్యక్షుడిగా పనిచేసే విషయంలో బైడెన్‌ వయసు మళ్లిన వ్యక్తిలా కనిపిస్తున్నారని, ఆయన కంటే ట్రంప్‌ మెరుగ్గా ఉన్నారంటూ సర్వేలో అభిప్రాయం వ్యక్తమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని