నేపాల్‌- చైనా మధ్య 12 ఒప్పందాలు

నేపాల్‌తో చైనా ద్వైపాక్షిక దూకుడును పెంచింది. ప్రస్తుతం బీజింగ్‌లో పర్యటిస్తున్న నేపాల్‌ ప్రధానమంత్రి పుష్పకుమార్‌ దహల్‌ (ప్రచండ)తో 12 ఒప్పందాలు కుదుర్చుకుంది.

Published : 26 Sep 2023 05:23 IST

బీజింగ్‌/కాఠ్‌మాండూ: నేపాల్‌తో చైనా ద్వైపాక్షిక దూకుడును పెంచింది. ప్రస్తుతం బీజింగ్‌లో పర్యటిస్తున్న నేపాల్‌ ప్రధానమంత్రి పుష్పకుమార్‌ దహల్‌ (ప్రచండ)తో 12 ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో వాణిజ్యం, రహదారుల అనుసంధానం, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ తదితర రంగాలు ఉన్నాయి. సోమవారం.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రచండ సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. భవిష్యత్తులో రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి అవసరమైన సహకారం పెంపొందించుకోవడానికి, వాణిజ్యం, ప్రజా సంబంధాల మెరుగుపరచుకోవడం తదితర అంశాలపై ఇరు దేశాలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి. గతంలో బీజింగ్‌కు అనుకూలంగా వ్యవహరించిన ప్రచండ.. తర్వాత డ్రాగన్‌కు దూరం జరిగారన్న కథనాలు వచ్చాయి. ప్రచండ ప్రస్తుతం చైనాలో ఏకంగా 8 రోజులు పర్యటిస్తుండటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని