రైలు ప్రమాదాన్ని నిలువరించిన బాలుడికి పురస్కారం

భారీ వర్షాలకు రైలుపట్టాల కింద మట్టి, రాళ్లు కొట్టుకుపోయిన తరుణంలో అదే మార్గంలో వస్తున్న ప్రయాణికుల రైలును గుర్తించి ప్రమాదాన్ని నివారించడంలో దోహదపడిన 12 ఏళ్ల బాలుడికి రైల్వేశాఖ పురస్కారపత్రం, నగదు బహుమతి అందజేసింది.

Published : 26 Sep 2023 05:23 IST

దిల్లీ: భారీ వర్షాలకు రైలుపట్టాల కింద మట్టి, రాళ్లు కొట్టుకుపోయిన తరుణంలో అదే మార్గంలో వస్తున్న ప్రయాణికుల రైలును గుర్తించి ప్రమాదాన్ని నివారించడంలో దోహదపడిన 12 ఏళ్ల బాలుడికి రైల్వేశాఖ పురస్కారపత్రం, నగదు బహుమతి అందజేసింది. పశ్చిమబెంగాల్‌లోని భలూకా రోడ్‌ యార్డుకు చేరువగా గత గురువారం ఈ ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సమీప గ్రామానికి చెందిన ముర్సలిన్‌ షేక్‌ తాను ధరించిన ఎర్రషర్టుని ఊపుతూ రైలు లోకోపైలట్‌ను అప్రమత్తం చేయడంతో ఆయన ఆకస్మిక బ్రేకు వేసి.. ప్రమాదం జరగబోయిన స్థలానికి ముందే రైలును ఆపగలిగారు. రైలుమార్గం సరిగా లేదని గుర్తించిన క్షణాల్లోనే స్పందించిన ముర్సలిన్‌ను అభినందించడానికి ఉత్తర మాల్డా ఎంపీ ఖగెన్‌ ముర్ము, కతిహార్‌ డీఆర్‌ఎం సురేంద్రకుమార్‌ సోమవారం ఆ బాలుడి ఇంటికి వెళ్లారు. చిన్న వయసులోనే స్పందించే గుణం ఉండడాన్ని కొనియాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని