సముద్రంపైనే కంచెలు వేస్తున్న చైనా
చైనా ఏకంగా సముద్రంపైనే కంచెలు వేస్తోంది. ఫిలిప్పీన్స్ చేపల వేటను అడ్డుకునేందుకు వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలోని స్కార్బోరో ప్రాంతంలో తేలియాడే కంచెను ఏర్పాటు చేసింది.
ఫిలిప్పీన్స్ ఆరోపణ
కంచెను తొలగించామని వెల్లడి
మనీలా: చైనా ఏకంగా సముద్రంపైనే కంచెలు వేస్తోంది. ఫిలిప్పీన్స్ చేపల వేటను అడ్డుకునేందుకు వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలోని స్కార్బోరో ప్రాంతంలో తేలియాడే కంచెను ఏర్పాటు చేసింది. తమ చేపల వేట పడవలు రాకుండా బీజింగ్ ఇలా చేసిందని ఫిలిప్పీన్స్ ఆరోపించింది. అయితే వెంటనే ఆ కంచెను తొలగించామని తెలిపింది. ఈ ఘటనపై ఆ దేశ కోస్టుగార్డు ప్రతినిధి జైటర్రేలా ట్విటర్లో స్పందించారు. ‘గత శుక్రవారం సాధారణ సముద్ర గస్తీ సమయంలో ఫిలిప్పీన్స్ కోస్టుగార్డు ఈ తేలియాడే కంచెను గుర్తించింది. ఇది దాదాపు 980 అడుగులపైనే ఉంది. బాజో డె మాసిన్‌లోక్ ఆగ్నేయ ప్రాంతంలోని స్కార్బోరోలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ఉన్న సముద్ర దిబ్బలవైపు మా చేపల వేట పడవలు రాకుండా చైనా ఇలా చేస్తోంది’ అని ఆ ప్రతినిధి వెల్లడించారు. చైనా బోట్లు ఫిలిప్పీన్స్ నౌకలను 15 సార్లు రేడియో సెట్లో హెచ్చరించాయి. చైనా చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొన్నాయి. కానీ ఫిలిప్పీన్స్ నౌకలో కొందరు మీడియా సిబ్బంది ఉన్నారని తెలుసుకుని చైనా నౌకలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. మరోవైపు చైనా ఈ ప్రకటనను ఖండించింది. ఫిలిప్పీన్స్ రాజకీయ ఆరోపణల కోసం తప్పుడు సమాచారాన్ని వాడుకుంటోందని పేర్కొంది. ఈ మేరకు చైనా ప్రతినిధి మావో నింగ్ ప్రకటన వెలువరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Iraq: ఇరాక్‌లో బాంబు దాడి.. 10 మంది మృతి
ఇరాక్‌లోని దియాలా ప్రావిన్స్‌లో స్థానిక ఎంపీ బంధువులపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో పది మంది మృతి చెందగా.. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. -
రామస్వామి అభ్యర్థిత్వానికి ఎదురుదెబ్బలు
అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికల బరిలో దిగేందుకు రిపబ్లికన్ పార్టీ నామినేషను కోసం పోటీపడుతున్న భారత సంతతి అమెరికన్ వివేక్ రామస్వామి (38)కి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
భూతాపంలో 2023 కొత్త రికార్డు
వాతావరణ రికార్డుల్లో 2023 అత్యుష్ణ సంవత్సరంగా నిలిచిపోనుందని ఐక్యరాజ్య సమితికి అనుబంధమైన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) గురువారం తెలిపింది. -
చర్చల ప్రసక్తే లేదన్న ఉత్తర కొరియా
తాము ఇటీవల నిర్వహించిన గూఢచారి ఉపగ్రహ ప్రయోగాన్ని అమెరికా ఖండించడంపై ఉత్తర కొరియా అధ్యక్షుడి సోదరి కిమ్ యో జాంగ్ గురువారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు సింగపూర్, జ్యూరిచ్
ఈ ఏడాది ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలుగా సింగపూర్, జ్యూరిచ్ నిలిచాయని ‘ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్’ (ఈఐయూ) తెలిపింది. -
97కు చేరిన బందీల విడుదల
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణను గురువారం ఉదయం మరో రోజుకు పొడిగించారు. వాస్తవానికి గురువారం ఉదయం 7 గంటలకు ఒప్పందం ముగియాల్సి ఉంది. -
అమెరికా దౌత్యవేత్త హెన్రీ కిసింజర్ మృతి
ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో అమెరికా విదేశాంగ విధానాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ దౌత్యవేత్త హెన్రీ కిసింజర్(100) బుధవారం కనెక్టికట్‌లోని తన స్వగృహంలో కన్నుమూశారు. -
మొదటి నుంచీ అదే చెబుతున్నాం
సిక్కు వేర్పాటువాది హత్యకు కుట్ర పన్నిన భారతీయుడిపై అమెరికా అభియోగాలను మోపడంద్వారా మేం చెబుతున్న వాదనలకు బలం చేకూరిందని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో వ్యాఖ్యానించారు. -
తూర్పు ఉక్రెయిన్‌పై రష్యా దాడులు
తూర్పు ఉక్రెయిన్‌లోని దొనెట్స్క్ ప్రాంతంపై గురువారం రష్యా ఎస్-300 క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో పలు నివాస గృహాలు ధ్వంసమయ్యాయి. -
ఓస్ప్రేల నిలిపివేత!
అమెరికా వైమానిక దళానికి చెందిన ఓస్ప్రే విమానం సాగర జలాల్లో కూలిపోయిన నేపథ్యంలో జపాన్ పునరాలోచనలో పడింది. తన వద్ద ఉన్న ఇదే తరహా విమానాల కార్యకలాపాలను కొంతకాలం పాటు నిలిపివేయాలని భావిస్తోంది. -
‘మరింత అణుశక్తి కావాలి’
వాతావరణ మార్పులపై పోరాటానికి మరింత అణుశక్తి కావాల్సి ఉందని, పెరుగుతున్న విద్యుత్తు అవసరాలకు ఇది ఎంతో ముఖ్యమని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ డైరెక్టర్ జనరల్ రఫేల్ మారియానా గ్రాసీ పేర్కొన్నారు.