ECHELON: ష్.. ఏదీ దాచలేం
మెయిలో, వాట్సపో, సిగ్నలో, అత్యాధునిక మొబైలో, చివరికి శాటిలైట్ ఫోనో.. పరికరం ఏదైనా కానీ ప్రతి సందేశం, లావాదేవీ, ప్రతి మాటా నిఘానీడలో ఉన్నాయని తెలుసా? దేశాధినేతలూ, సైన్యాలకూ ఈ నిఘానేత్రం పరిధి తప్పడంలేదు. మనం మనసులో అనుకునేది తప్పించి ఏ ఒక్కటీ ఈ ప్రపంచంలో రహస్యం కాదేమో! అందరినీ అనుక్షణం కళ్లప్పగించి చూస్తున్న పంచనేత్రమే ఎకలాన్!
సమస్తం ‘ఎకలాన్’ గుప్పిట్లో
ప్రపంచంలో అన్ని డిజిటల్ సందేశాలపై నిఘా
ఆ ఐదు దేశాలు దేన్నైనా పట్టేస్తాయి
కెనడా వివాదంతో తెరపైకి ఈ ప్రాజెక్టు
మెయిలో, వాట్సపో, సిగ్నలో, అత్యాధునిక మొబైలో, చివరికి శాటిలైట్ ఫోనో.. పరికరం ఏదైనా కానీ ప్రతి సందేశం, లావాదేవీ, ప్రతి మాటా నిఘానీడలో ఉన్నాయని తెలుసా? దేశాధినేతలూ, సైన్యాలకూ ఈ నిఘానేత్రం పరిధి తప్పడంలేదు. మనం మనసులో అనుకునేది తప్పించి ఏ ఒక్కటీ ఈ ప్రపంచంలో రహస్యం కాదేమో! అందరినీ అనుక్షణం కళ్లప్పగించి చూస్తున్న పంచనేత్రమే ఎకలాన్! అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే, న్యూజిలాండ్ ఉమ్మడి నిఘా ప్రాజెక్టే ఇది. కెనడా-భారత్ దౌత్య ఘర్షణతో ఈ అంశం తెరపైకి వచ్చింది. ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్యపై భారత్ పాత్రకు బలమైన సాక్ష్యాలు ఉన్నాయంటున్న కెనడా పదేపదే దబాయించి చెబుతున్న ఆధారాలు ఎకలాన్ ప్రాజెక్టు ద్వారా సేకరించి ఉండొచ్చన్నది అంతర్జాతీయ నిపుణుల అనుమానం!
ఏమిటీ ఎకలాన్?
ఎకలాన్ అనేది వాస్తవానికి రహస్య కోడ్. ఇదో సిగ్నల్ ఇంటెలిజెన్స్, అనాలిసిస్ ప్రాజెక్టు. యూకే యూఎస్‌ఏ రక్షణ ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాలు (అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యూకే) దీన్ని నిర్వహిస్తాయి. ఈ కూటమే ఫైవ్ ఐస్ (ఐదు కళ్లు)గా పేరొందింది. 1947లోనే అయిదు ఆంగ్లేయ దేశాలు ఈ రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రపంచాన్ని ఈ అయిదూ పంచుకొని నిఘా నేత్రాల్ని విప్పార్చాయి. ప్రచ్ఛన్నయుద్ధ సమయంలో సోవియట్ యూనియన్, దాని కూటమిలోని దేశాల సైనిక, దౌత్యపరమైన సమాచారంపై నిఘా పెట్టడానికి ఈ ప్రాజెక్టును ప్రధానంగా ఉద్దేశించారు. 1975కు ముందు దీన్ని షామ్‌రాక్ అనే కోడ్ పేరుతో పిలిచేవారు. ఆ తర్వాత ఆధునిక సాంకేతికత పెరిగాక ఈ ఎకలాన్ భారీగా విస్తరించింది. పరిశ్రమలు, వ్యక్తులపైనా దృష్టి పడింది. అమెరికాలోని మేరీలాండ్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగినా, దీని ప్రధాన కేంద్ర కార్యాలయం బ్రిటన్‌లో ఉంది.
ఏం చేస్తారు?
ఎలక్ట్రానిక్, డిజిటల్ రూపంలో ప్రపంచవ్యాప్తంగా వెళ్లే ఏ సందేశాన్నైనా, లావాదేవీనైనా సూపర్ కంప్యూటర్లు, శాటిలైట్ సాంకేతికతల ద్వారా ఒడిసి పడతారు. ఎకలాన్ నిఘంటువులోని కీలక పదాల ఆధారంగా వాటిని జల్లెడ పడతారు. తమకు అనుమానం వచ్చిన, కావాల్సిన వాటిని ఎంపిక చేసుకొని ఈ ఐదు దేశాలూ ఒకదానితో ఒకటి పంచుకొని విశ్లేషిస్తాయి. అమెరికా అనేక దేశాల్లో స్వయంగా (దొంగచాటుగా) ఈ ఎకలాన్ ఇంటర్‌సెప్ట్ స్టేషన్లను నిర్వహిస్తోందని ఎడ్వర్డ్ స్నోడెన్ గతంలో బయటపెట్టడం సంచలనం సృష్టించింది. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం... బ్రెజిల్, జర్మనీ, భారత్, జపాన్, థాయిలాండ్‌ల్లో అమెరికా ఎకలాన్ నిఘా వ్యవస్థను నడుపుతోంది.
తిరుగుబాట్లు, ఆందోళనల వెనుక
అనేక దేశాల్లో అల్లర్లు, ఆందోళనలు, ప్రభుత్వాల కూల్చివేతలు, తిరుగుబాట్ల వెనక అమెరికా నిఘా సంస్థ సీఐఏ హస్తం ఉందనే ఆరోపణలు చాలా సంవత్సరాలుగా ఉన్నాయి. ఎకలాన్‌తో సేకరించిన సమాచారంతోనే ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో అమెరికా ఆధిపత్యం చెలాయిస్తోందనేవారు లేకపోలేదు. ఈ ఐదు దేశాలకు ఇజ్రాయెల్ సాంకేతికత కూడా తోడవటంతో నిఘాలో మరింత పదును పెరిగింది. 1990 తర్వాత ఇతర దేశాలతోపాటు స్వదేశంలోని కంపెనీలు, ప్రముఖులు, సామాన్య ప్రజలపైనా ఈ ఐదు దేశాలు నిఘా మొదలెట్టాయని న్యూజిలాండ్‌కు చెందిన నికీ హేగర్, అమెరికాకు చెందిన జేమ్స్ బామ్‌ఫోర్డ్, బ్రిటిష్ జర్నలిస్టు డంకన్ కాంప్‌బెల్‌లు వెల్లడించి సంచలనం సృష్టించారు. అమెరికా తన సొంత సెనెటర్లపైనా నిఘా పెట్టిందని తేలింది.
పరిధులు దాటి
దౌత్య, సైనిక సమాచారాలతో పాటు ఆయా దేశాల పారిశ్రామిక, వాణిజ్య విధానాలను ముందే రహస్యంగా తెలుసుకోవటం... వాటికి తగ్గట్లు జాగ్రత్తపడటం కూడా ఎకలాన్ ద్వారా జరుగుతోంది. తమ వాణిజ్య వ్యవహారాలపై అమెరికా నిఘా నేత్రం కన్నేసిందని యూరోపియన్ పార్లమెంటు 2001లో ఓ నివేదికలో ఆందోళన వ్యక్తంచేయటం గమనార్హం. ఒక్కమాటలో చెప్పాలంటే... ఈ ఎకలాన్ అనేది ఐదు ఆంగ్లేయ దేశాలు నడుపుతున్న రహస్య సైబర్ సీక్రెట్ పోలీసు.
సాయం పేరుతో ఓ చెవి వేశారు
రెండో ప్రపంచయుద్ధం ముగింపు వెనక కీలక పాత్ర పోషించింది పాశ్చాత్యదేశాల నిఘానేత్రమే! జర్మనీ, జపాన్‌ల పరాజయంలో తెరవెనక ప్రధాన పాత్ర పోషించిన అగ్రరాజ్యాలు పరిశోధనలకు బాగా వెచ్చించి ఆధునిక కమ్యూనికేషన్ పరికరాలను తయారు చేశాయి. మిగిలిన అన్ని దేశాలూ వీరిపై ఆధారపడ్డాయి. అమెరికా, బ్రిటన్ అనేక దేశాలకు తమ పరికరాలను అమ్మటం ఆరంభించాయి. సోవియట్ యూనియన్ తనదైన వ్యవస్థలను రూపొందించుకుంది. తన అనుకూల దేశాలకు వాటిని సరఫరా చేసింది. మొత్తానికి ఇరుపక్షాలూ... తమ పరికరాల రూపంలో అన్ని దేశాల్లోకి చొరబడ్డాయి. కమ్యూనికేషన్ వ్యవస్థల్లో సాయం చేస్తున్నట్లు పైకి కనిపించినా, ఆయా దేశాల గుట్టుమట్లన్నీ లోపాయికారీగా తమకు తెలిసేలా ఏర్పాట్లు చేసుకున్నాయి.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాజాలో దాడులను ముగించాలి
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధ పరిస్థితులపై స్పెయిన్‌లోని బార్సెలోనాలో సోమవారం ఐరోపా సమాజం (ఈయూ), అరబ్, ఉత్తర ఆఫ్రికా దేశాల ప్రతినిధులు భేటీ అయ్యారు. 42 దేశాలకు చెందిన ప్రతినిధులు భేటీకి వచ్చారు. -
బుకర్ ప్రైజ్ విజేత పాల్ లించ్
ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్‌ను 2023 సంవత్సరానికి గాను ఐర్లాండ్ రచయిత పాల్ లించ్ గెలుచుకున్నారు. ఆయన రాసిన ‘ప్రాఫెట్ సాంగ్’ నవలకు ఈ అవార్డు లభించింది. -
నకిలీ ప్రపంచంలో ‘నిజం’ కోసం ఆరాటం
సాంకేతిక సాయంతో తన ఫొటోలను అసభ్యంగా మార్చి ప్రచారంలో పెట్టారని ఇటీవల ఒక నటి ఆక్రోశించడంతో ‘డీప్‌ఫేక్’ అనే పదం బాగా వెలుగులోకి వచ్చింది. ఇది భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు. -
అమెరికాలో పని అనుమతులపై రగడ
మెక్సికో, వెనెజువెలా, కొలంబియా వంటి లాటిన్ దేశాల నుంచి అమెరికాకు వలస వచ్చేవారి సంఖ్య నానాటికీ పెరుగుతూ కొత్త సమస్యలు కొనితెస్తోంది. అమెరికాలో పంటకోతలు, పండ్లు, కూరగాయలు తెంపడం, హోటళ్లు, దుకాణాల్లో, భవన నిర్మాణంలో పనిచేయడం వంటివాటితో వలసదారులు జీవనాధారం పొందుతున్నారు. -
నల్ల సముద్రంలో తుపాను.. అంధకారంలో 20 లక్షల మంది
నల్ల సముద్రంలో ఏర్పడిన తుపాను కారణంగా రష్యా ఆక్రమిత క్రిమియా అతలాకుతలమైంది. దక్షిణ రష్యాలోని సోచీ తీరంలోనూ పెద్దఎత్తున అలలు ఎగిసిపడ్డాయి. అనాపా, కుబాన్ తదితర ప్రాంతాల్లో ఆస్తి నష్టం సంభవించింది. -
భారతీయ కొవిడ్ బాధితులకు ప్రయోజనం అంతంతే
కొవిడ్-19 చికిత్సకు డెక్సామెథాసోన్ మందును ఎక్కువ మోతాదులో వాడటం వల్ల ఐరోపావాసులకు కలిగేంత ప్రయోజనం భారతీయులకు కలగలేదని ప్రముఖ వైద్యపత్రిక ‘లాన్సెట్’ ప్రచురితమైన అధ్యయనం తెలిపింది. -
ఊపిరితిత్తుల వాపుతో బాధపడుతున్న పోప్
ఊపిరితిత్తుల వాపుతో బాధపడుతున్న పోప్ ఫ్రాన్సిస్(86).. యాంటీబయాటిక్స్‌ను ఉపయోగిస్తున్నారని వాటికన్ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ఆయనకు నిమోనియా కానీ జ్వరం కానీ లేవని స్పష్టంచేసింది. -
పాక్‌లో భద్రతాబలగాలు లక్ష్యంగా ఆత్మాహుతి దాడి
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌లో తెహ్రీక్-ఎ-తాలిబాన్(టీటీపీ) తీవ్రవాదులు ఘాతుకానికి ఒడిగట్టారు. భద్రతా బలగాల్ని లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడిచేశారు. -
న్యూజిలాండ్‌కు కొత్త ప్రధానిగా లక్సన్
న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్టఫర్ లక్సన్ (53) సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం దేశార్థికాన్ని మెరుగుపరచడమే తన ప్రథమ లక్ష్యమని ప్రకటించారు. -
పోలండ్‌కు అల్పాయుష్షు ప్రభుత్వం!
పోలండ్‌లో సోమవారం ప్రమాణ స్వీకారం చేసే మితవాద లా అండ్ జస్టిస్ పార్టీ ప్రభుత్వానికి 14 రోజుల్లోనే ఆయుష్షు తీరిపోనుంది. అక్టోబరులో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 460 స్థానాల్లో ఆ పార్టీకి 194 మాత్రమే వచ్చాయి. -
మెటాపై 33 అమెరికా రాష్ట్రాల దావా
ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల మాతృ సంస్థ ‘మెటా’.. 13 ఏళ్లలోపు పిల్లల వ్యక్తిగత సమాచాన్ని సేకరించిందని ఆరోపిస్తూ అమెరికాలోని పలు రాష్ట్రాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. -
న్యూయార్క్‌లో రెచ్చిపోయిన ఖలిస్థానీ మద్దతుదారులు
అమెరికాలోని ఖలిస్థాన్ మద్దతుదారులు మరోసారి రెచ్చిపోయారు. సిక్కుల గురుపూర్ణిమ సందర్భంగా న్యూయార్క్‌లోని హిక్స్విల్ గురుద్వారాకు వెళ్లిన భారత రాయబారి తరణ్‌జీత్ సింగ్ సంధూను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. -
బ్యాక్టీరియాకు నాలుగుతరాల జ్ఞాపకాలు!
ఏకకణ జీవులైనప్పటికీ బ్యాక్టీరియాకు జ్ఞాపకశక్తి సామర్థ్యం ఉంటుందని, ఆ జ్ఞాపకాలను తమ వారసులకూ చేరవేయగలవని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. -
సొంత పాస్‌పోర్టు నంబర్లే ఇవ్వాలి
వీసాల కోసం దరఖాస్తు చేసుకునే భారతీయ విద్యార్థులకు అమెరికా రాయబార కార్యాలయం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ మార్పులు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఎఫ్, ఎం, జే వీసాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఇవి వర్తిస్తాయి. -
కాల్పుల విరమణ మరో 2 రోజులు పొడిగింపు
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మరో 2 రోజులు కొనసాగనుంది. తొలుత కుదుర్చుకున్న నాలుగు రోజుల ఒప్పందం సోమవారంతో ముగియడంతో ఖతార్, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో 2 రోజుల పొడిగింపునకు రెండు వర్గాలు అంగీకరించాయి. -
ఉభయ కొరియాల మధ్య సైనిక గస్తీ శిబిరాల పునరుద్ధరణ
ఇటీవల ఉత్తర కొరియా ఒక నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించడంతో దక్షిణ కొరియాతో ఉద్రిక్తత పెరిగింది. సరిహద్దులో గస్తీ శిబిరాలను ఉత్తర కొరియా పునరుద్ధరించింది. దక్షిణ కొరియాతో ఇదివరకు కుదిరిన సంధికి చెల్లుచీటీ రాసింది. -
కుమార్తె పెళ్లికి రూ.490 కోట్ల వ్యయం
ఆడంబరంగా పెళ్లి చేయాలంటే హంగూ ఆర్భాటం, భారీస్థాయి విందు, ఆకట్టుకునే అలంకరణలు.. ఇవన్నీ కనిపిస్తాయి. పారిస్ వేదికగా కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ పెళ్లి మాత్రం వీటిని సరికొత్త ఎత్తుకు తీసుకువెళ్లింది. -
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు 14 రోజుల జుడీషియల్ రిమాండ్
వివిధ కేసుల్లో అరెస్టయి జైలు శిక్ష అనుభవిస్తున్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు పాకిస్థాన్ అకౌంటబిలిటీ న్యాయస్థానం 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. -
ఐస్లాండ్లో మళ్లీ భూప్రకంపనలు
ఐరోపాలోని ద్వీప దేశం ఐస్లాండ్ వరుస భూ ప్రకంపనలతో వణికిపోతోంది. ఒక్క ఆదివారమే 700 ప్రకంపనలను చవిచూసింది. వీటివల్ల గ్రిండావిక్ ప్రాంతాన్ని ఇప్పటికే స్థానికులు ఖాళీ చేయాల్సి వచ్చింది. -
WHO: ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరికి తప్పని వేధింపులు!
ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు తమ జీవిత కాలంలో శారీరక/లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది.