పెట్రోల్‌ బంక్‌లో భారీ పేలుడు.. నాగర్నో-కారాబఖ్‌లో 20 మంది మృతి

ఆర్మేనియా, అజర్‌బైజాన్‌ మధ్యనున్న వివాదాస్పద వేర్పాటువాద ప్రాంతం నాగర్నో-కారాబఖ్‌లోని ఓ పెట్రోల్‌ బంక్‌లో సంభవించిన భారీ పేలుడులో కనీసం 20 మంది ప్రజలు మృతి చెందారు.

Updated : 27 Sep 2023 06:29 IST

యెరెవాన్‌: ఆర్మేనియా, అజర్‌బైజాన్‌ మధ్యనున్న వివాదాస్పద వేర్పాటువాద ప్రాంతం నాగర్నో-కారాబఖ్‌లోని ఓ పెట్రోల్‌ బంక్‌లో సంభవించిన భారీ పేలుడులో కనీసం 20 మంది ప్రజలు మృతి చెందారు. 300 మందికిపైగా గాయపడ్డారు. నాగర్నో-కారాబఖ్‌ను పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకోవడానికి అజర్‌బైజాన్‌ సైన్యం దాడులను ముమ్మరం చేసింది. దీంతో నాగర్నో-కారాబఖ్‌ నుంచి వేల మంది ప్రజలు ఆర్మేనియాలో తలదాచుకునేందుకు పారిపోతున్న క్రమంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. తమ వాహనాలకు ఇంధనాన్ని నింపుకొనేందుకు అధిక సంఖ్యలో ప్రజలు అక్కడ వేచిచూస్తున్న సమయంలో విస్పోటం జరిగింది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని