పాకిస్థాన్‌ ఖాళీ చేయాల్సిందే.. ఐరాస వద్ద పీవోకే ప్రజల నిరసన

పాకిస్థాన్‌ పాలకులకు వ్యతిరేకంగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) ప్రజలు తమ నిరసన గళం ఐక్యరాజ్య సమితివద్ద వినిపించారు.

Published : 27 Sep 2023 05:08 IST

ఈటీవీ భారత్‌: పాకిస్థాన్‌ పాలకులకు వ్యతిరేకంగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) ప్రజలు తమ నిరసన గళం ఐక్యరాజ్య సమితివద్ద వినిపించారు. జెనీవాలోని ఐరాస మానవ హక్కుల మండలి 54వ సమావేశాలు జరుగుతున్న సమయంలో పీవోకేకు చెందిన కొందరు రాజకీయ కార్యకర్తలు.. ఇస్లామాబాద్‌ పాలకులకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. వెంటనే పీవోకేను పాకిస్థాన్‌ ఖాళీ చేసి తాము శాంతియుత జీవితం గడిపేందుకు సహకరించాలని నినాదాలు చేశారు. యునైటెడ్‌ కశ్మీర్‌ పీపుల్స్‌ నేషనల్‌ పార్టీ కార్యకర్తలు.. సోమవారం ఐరాస వెలుపల జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నారు.

కరెంటు కోతలతో ఉక్కిరి బిక్కిరి

పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పీవోకే ప్రజలు చేస్తున్న ఆందోళనలను పాక్‌ పాలకులు ఉక్కుపాదంతో అణచి వేస్తున్నారు. అనధికార విద్యుత్‌ కోతలతో పీవోకేలో అన్ని వ్యాపారాలు దెబ్బతిన్నాయి. చాలా ప్రదేశాల్లో రోజుకు కొన్ని గంటలే విద్యుత్‌ సరఫరా చేస్తుండటం.. వీరి బతుకులను అంధకారంవైపు నడిపిస్తోంది. పాకిస్థాన్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే పీవోకేలో అత్యధిక విద్యుత్‌ బిల్లులను వసూలు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని