కదం తొక్కిన దక్షిణ కొరియా

ఉత్తర కొరియా అధినేత కిమ్‌ ఒకవేళ తమపైకి అణ్వాయుధాలే ప్రయోగిస్తే అమెరికా కూటమితో కలిసి ఆయన పాలనను అంతం చేస్తామని దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ హెచ్చరించారు.

Published : 27 Sep 2023 05:08 IST

సాయుధ బలగాల దినోత్సవంలో భారీ కవాతు
కిమ్‌ అణ్వాయుధాలే ప్రయోగిస్తే అంతం చేస్తామన్న యోల్‌

సియోల్‌: ఉత్తర కొరియా అధినేత కిమ్‌ ఒకవేళ తమపైకి అణ్వాయుధాలే ప్రయోగిస్తే అమెరికా కూటమితో కలిసి ఆయన పాలనను అంతం చేస్తామని దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ హెచ్చరించారు. వరుసగా క్షిపణి ప్రయోగాలు, కవ్వింపు చర్యలతో ఉత్తర కొరియా నుంచి ముప్పు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దక్షిణ కొరియా సేనలు మంగళవారం సియోల్‌ వీధుల్లో కదం తొక్కాయి. 75వ ‘సాయుధ బలగాల దినోత్సవం’ సందర్భంగా పెద్దఎత్తున ఆయుధ సంపత్తిని ప్రదర్శించాయి. యుద్ధ ట్యాంకులు, ఫిరంగి వ్యవస్థలు, డ్రోన్లు, ఉత్తర కొరియాలోని ఏ మూలకైనా చేరుకోగల శక్తిమంతమైన బాలిస్టిక్‌ క్షిపణులు, ఇతర ఆయుధ వ్యవస్థలు దీనిలో ఉన్నాయి. తుపాకులు, జెండాలతో 6,700 మంది సైనికులతో పాటు 300 మంది అమెరికా సైనికులూ ఇందులో భాగమయ్యారు. ఈస్థాయి ప్రదర్శన పదేళ్లలో ఇదే మొదటిసారి. ఉత్తర కొరియా ఆగడాలను కట్టడి చేసేందుకు పటిష్ఠమైన సైన్యాన్ని నిర్మిస్తామని యూన్‌ ప్రతినబూనారు. వారికి విజయసంకేతం చూపిస్తూ చప్పట్లు కొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని