హఠాత్తుగా ఆగిన లాంబర్‌జాక్.. గాల్లో వేలాడిన సందర్శకులు
పిల్లలు, స్నేహితులతో సరదాగా పార్కు వెళ్లిన సందర్శకులకు చేదు అనుభవం ఎదురైంది. వారు ఎక్కిన ‘లాంబర్‌జాక్ రైడ్’ ఆకస్మికంగా ఆగిపోవడంతో వారంతా గాల్లో తలకిందులుగా వేలాడారు.
ఆంటారియో: పిల్లలు, స్నేహితులతో సరదాగా పార్కు వెళ్లిన సందర్శకులకు చేదు అనుభవం ఎదురైంది. వారు ఎక్కిన ‘లాంబర్‌జాక్ రైడ్’ ఆకస్మికంగా ఆగిపోవడంతో వారంతా గాల్లో తలకిందులుగా వేలాడారు. ఈ ఘటన కెనడాలో చోటు చేసుకుంది. ఒంటారియోలోని ‘వండర్‌ల్యాండ్’ అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో కొందరు సందర్శకులు లాంబర్‌జాక్ రైడ్ ఎక్కారు. పైకి వెళ్లిన కాసేపటికి అది హఠాత్తుగా ఆగిపోయింది. అందులో చిక్కుకుపోయిన వారంతా దాదాపు 30 నిమిషాలపాటు గాల్లో తలకిందులుగా వేలాడారు. భయాందోళనకు గురై కాపాడండి అంటూ కేకలు వేశారు. దానిలో చిక్కుకుపోయిన కొంతమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘రైడ్‌లో భాగంగా సందర్శకులు ఎక్కిన లాంబర్‌జాక్ పైకి వెళ్లాక ఆకస్మికంగా ఆగిపోయింది. కాసేటికి సందర్శకులను సురక్షితంగా కిందకు దించాం. శనివారం రాత్రి 11 గంటలకు ఈ ఘటన జరిగింది’’ అని పార్క్ యాజమాన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రమాదకర ఘటన చోటు చేసుకోవడంతో పార్క్‌ను కొన్ని రోజుల పాటు మూసి వేసినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ratan Tata: రిస్క్‌లేని పెట్టుబడి అంటూ.. రతన్ టాటా నకిలీ ఇంటర్వ్యూ ఇన్‌స్టాలో పోస్టు
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/12/2023)
-
Karnataka: నియామక పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే.. 10ఏళ్ల వరకు జైలు, రూ.10కోట్ల జరిమానా!
-
QR code scams: క్యూఆర్ కోడ్ స్కామ్‌లతో జాగ్రత్త!
-
Shah Rukh Khan: ఆ క్షణం ప్రపంచానికి రాజునయ్యాననిపించింది: షారుక్
-
INDw vs ENGw: ఇంగ్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్.. తొలి మ్యాచ్‌లో ఓడిన భారత్