పోప్‌ను ప్రశ్నిస్తున్న క్రైస్తవ మతాధికారులు

స్వలింగ సంపర్కులపైనా, మహిళలను మతాధికారులుగా నియమించడంపైనా ఐరోపా, ఆసియా, ఆఫ్రికా, అమెరికా ఖండాలకు చెందిన అయిదుగురు క్రైస్తవ మతాధికారులు (కార్డినల్స్‌) పోప్‌ ఫ్రాన్సిస్‌ను నిలదీశారు.

Published : 03 Oct 2023 03:12 IST

అయిదు ప్రశ్నలతో లేఖ

వాటికన్‌ సిటీ: స్వలింగ సంపర్కులపైనా, మహిళలను మతాధికారులుగా నియమించడంపైనా ఐరోపా, ఆసియా, ఆఫ్రికా, అమెరికా ఖండాలకు చెందిన అయిదుగురు క్రైస్తవ మతాధికారులు (కార్డినల్స్‌) పోప్‌ ఫ్రాన్సిస్‌ను నిలదీశారు. రోమన్‌ క్యాథలిక్‌ చర్చి సంప్రదాయాలను కొనసాగించబోతున్నదీ లేనిదీ స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై పోప్‌నకు అయిదు ప్రశ్నలతో పంపిన లేఖను సోమవారం విడుదల చేశారు. రోమన్‌ క్యాథలిక్‌ చర్చి భవిష్యత్తు పంథాపై చర్చించి తగు నిర్ణయాలు తీసుకోవడానికి 450 మంది బిషప్‌లు, సాధారణ క్రైస్తవులు వాటికన్‌ సిటీలో మూడు వారాల పాటు ఆంతరంగిక సమావేశం జరుపుకోనున్న సందర్భంలో వీరి లేఖ సంచలనం సృష్టిస్తోంది. చర్చి వ్యవస్థలో మహిళలను నిర్ణయాత్మక పాత్రలలో నియమించడం, సామాన్య మతానుయాయుల వాణికి చర్చిలో మరింత ప్రాధాన్యం కల్పించడం సమావేశ అజెండాలోని ముఖ్యాంశాలు. అలాగే క్యాథలిక్‌ స్వలింగ సంపర్కులనూ చర్చి కలుపుకొని వెళ్ళాలని, బిషప్‌ల లైంగిక అకృత్యాలను నివారించడానికి జవాబుదారీ తీసుకురావాలనేది ఎజెండాలో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని