వెనక్కి తగ్గేది లేదు

రష్యాతో సాగుతోన్న పోరులో ఉక్రెయిన్‌కు ఎల్లవేళలా అండగా నిలుస్తామని ఐరోపా సమాఖ్య (ఈయూ) పేర్కొంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో సోమవారం ఈయూ 27 సభ్యదేశాల విదేశాంగ మంత్రుల సమావేశం నిర్వహించారు.

Published : 03 Oct 2023 04:08 IST

ఉక్రెయిన్‌కు అండగా ఉంటాం: ఈయూ

కీవ్‌: రష్యాతో సాగుతోన్న పోరులో ఉక్రెయిన్‌కు ఎల్లవేళలా అండగా నిలుస్తామని ఐరోపా సమాఖ్య (ఈయూ) పేర్కొంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో సోమవారం ఈయూ 27 సభ్యదేశాల విదేశాంగ మంత్రుల సమావేశం నిర్వహించారు. ఈయూ సభ్యదేశాల వెలుపల ఈ సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. రక్షణ, దౌత్యం, ఆర్థికం, ఆంక్షల విషయంలో మనం ఎంత వేగంగా ఉమ్మడి అడుగులు వేస్తే.. యుద్ధం అంత త్వరగా ముగుస్తుందని మంత్రులనుద్దేశించి వ్యాఖ్యానించారు. పరస్పర సహకారంపైనే విజయం ఆధారపడి ఉందన్నారు. ఐరోపా సమాఖ్య విదేశాంగ పాలసీ చీఫ్‌ జోసెప్‌ బోరెల్‌ ఈ భేటీని చరిత్రాత్మకంగా అభివర్ణించారు. ఉక్రెయిన్‌కు భద్రత, సైనిక సాయం, ఈయూలో చేరిక, శాంతి స్థాపన తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు. కీవ్‌కు తొలి మద్దతుదారు ఈయూనేనని, ఆ దేశానికి సాయం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని