9 కేసుల్లో ఇమ్రాన్‌కు బెయిలు

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు 9 కేసుల్లో సోమవారం ఇస్లామాబాద్‌ హైకోర్టు బెయిలు మంజూరు చేసింది.

Published : 03 Oct 2023 04:08 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు 9 కేసుల్లో సోమవారం ఇస్లామాబాద్‌ హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. బెయిళ్లను నిరాకరిస్తూ వివిధ కోర్టులు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆమెర్‌ ఫరూక్‌, మరో న్యాయమూర్తి తారిక్‌ మెహమూద్‌ జహంగీరిలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. ఈ ఏడాది మే 9వ తేదీన జరిగిన అల్లర్లపై దాఖలైన 3 కేసులు, ఇస్లామాబాద్‌లో నిరసనలకు సంబంధించిన 3, తోషాఖానా, 144వ సెక్షన్‌ ఉల్లంఘన, హత్యాయత్నం కేసుల్లో ఇమ్రాన్‌కు ధర్మాసనం ఒకే బెయిలిచ్చింది. ఈ కేసుల్లో ఇమ్రాన్‌ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుని తాజాగా విచారణ జరపాలని దిగువ కోర్టులను ఆదేశించింది. అయితే ఇప్పటికే జైలులో ఉన్న ఇమ్రాన్‌పై పలు కేసులున్నాయి. ఆయన విడుదలవుతారా లేదా అనేది తెలియడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు