రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో ఇద్దరు భారతీయుల మృతి

రష్యా సైన్యం నియమించుకున్న ఇద్దరు భారతీయులు ఇటీవల ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంగళవారం ప్రకటించింది.

Published : 12 Jun 2024 04:49 IST

దిల్లీ: రష్యా సైన్యం నియమించుకున్న ఇద్దరు భారతీయులు ఇటీవల ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంగళవారం ప్రకటించింది. ఈ తీవ్ర విషయాన్ని రష్యా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, రష్యా సైన్యం నియమించుకున్న భారతీయులందరినీ తిప్పిపంపాలని కోరామని వివరించింది. ఇద్దరి మృతదేహాల్ని సాధ్యమైనంత త్వరగా భారత్‌కు పంపాలని రష్యా అధికారుల్ని మాస్కోలోని భారత దౌత్యకార్యాలయం కోరినట్లు  తెలిపింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. రష్యా సైన్యానికి సహాయకారులుగా నియమించుకున్న పలువురు భారతీయుల్ని యుద్ధభూమికి పంపి.. ఉక్రెయిన్‌తో యుద్ధం చేయిస్తుండడంతో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి నియామకాలు ఇకపై చేపట్టవద్దని రష్యాకు సూచించినట్లు భారత్‌ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని