మలావీ ఉపాధ్యక్షుడు సౌలస్‌ దుర్మరణం

ఆఫ్రికా దేశమైన మలావీలో సైనిక విమానం అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. పర్వత ప్రాంతాల్లో సైనిక విమానం కూలిపోయిందని, ఈ ఘటనలో ఉపాధ్యక్షుడు సౌలస్‌ షిలిమా సహా 10 మంది దుర్మరణం చెందినట్లు ఆ దేశాధ్యక్షుడు లాజరస్‌ చక్వేరా మంగళవారం ప్రకటించారు.

Updated : 12 Jun 2024 06:24 IST

మరో తొమ్మిది మంది కూడా..
పర్వతాల్లో విమాన శకలాలను గుర్తించిన సైన్యం 

బ్లాంటైర్‌: ఆఫ్రికా దేశమైన మలావీలో సైనిక విమానం అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. పర్వత ప్రాంతాల్లో సైనిక విమానం కూలిపోయిందని, ఈ ఘటనలో ఉపాధ్యక్షుడు సౌలస్‌ షిలిమా సహా 10 మంది దుర్మరణం చెందినట్లు ఆ దేశాధ్యక్షుడు లాజరస్‌ చక్వేరా మంగళవారం ప్రకటించారు. గల్లంతైన విమానం శకలాలను గుర్తించామని.. అందులో ఎవరూ ప్రాణాలతో లేరని తెలిపారు. మలావీ ఉపాధ్యక్షుడు, మరో తొమ్మిది మందిని తీసుకెళ్తున్న సైనిక విమానం జూన్‌ 10న అదృశ్యమైన సంగతి తెలిసిందే. రాజధాని లిలోంగ్వే నుంచి బయలుదేరిన ఆ విమానం 370 కిలోమీటర్ల దూరంలోని జుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో 45 నిమిషాల తర్వాత దిగాల్సి ఉంది. ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడ దిగవద్దని, తిరిగి లిలోంగ్వేకు వెళ్లిపోవాలని ఏటీసీ సూచించింది. ఈ క్రమంలోనే రాడార్‌తో విమానానికి  సంబంధాలు తెగిపోయాయి. విమానం ఆచూకీ కనిపెట్టేందుకు వందల మంది సైనికులు, పోలీసు అధికారులు, అటవీ సిబ్బంది రంగంలోకి దిగారు. 24 గంటలకుపైగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పర్వతాల్లో విమాన శకలాలను గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు