సరిహద్దుల్లో దక్షిణ కొరియా కాల్పులు

ఉత్తర కొరియా దళాలు ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు సరిహద్దు ఉత్తర భాగంలో తమ భూభాగంలోకి ప్రవేశించడంతో హెచ్చరిక కాల్పులు జరిపినట్లు దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ మంగళవారం తెలిపింది.

Updated : 12 Jun 2024 06:19 IST

ఉత్తర కొరియా సైనికులు తమ భూభాగంలోకి ప్రవేశించడంతో హెచ్చరిక

ఉత్తరకొరియా సరిహద్దు ప్రాంతంలో దక్షిణ కొరియా ఏర్పాటు చేసిన లౌడ్‌ స్పీకర్లు 

సియోల్‌: ఉత్తర కొరియా దళాలు ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు సరిహద్దు ఉత్తర భాగంలో తమ భూభాగంలోకి ప్రవేశించడంతో హెచ్చరిక కాల్పులు జరిపినట్లు దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ మంగళవారం తెలిపింది. హెచ్చరిక కాల్పులతో ఉత్తర కొరియా సైనికులు పొరపాటును గ్రహించి వెనక్కి వెళ్లిపోయారని వివరించింది. ఉత్తర కొరియా ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు నిర్వహించలేదని పేర్కొంది. వారు ఉద్దేశపూర్వకంగా సరిహద్దు దాటినట్లు కనిపించడం లేదని దక్షిణ కొరియా సైన్యం అంచనా వేసింది. దక్షిణ కొరియా మీడియా నివేదికలు మాత్రం.. దాదాపు 20 మంది నుంచి 30 మంది ఉత్తర కొరియా సైనికులు సుమారు 50 మీటర్లు దక్షిణ కొరియా భూభాగంలోకి ప్రవేశించారని స్పష్టం చేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు