స్పీడ్‌ బోట్‌లో తైవాన్‌ చేరిన చైనా మాజీ నేవీ అధికారి

చైనా మాజీ నేవీ అధికారి ఒకరు ఆ దేశం నుంచి పారిపోయి తైవాన్‌ చేరుకున్నారు.

Published : 12 Jun 2024 06:08 IST

 స్వదేశంలో వేధింపులతో పారిపోయి వచ్చినట్లు వెల్లడి

తైపీ: చైనా మాజీ నేవీ అధికారి ఒకరు ఆ దేశం నుంచి పారిపోయి తైవాన్‌ చేరుకున్నారు. రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో అకస్మాత్తుగా చైనా అసమ్మతి పౌరుడు తమ భూభాగంలోకి ప్రవేశించడం తైవాన్‌ అధికార వర్గాలను కలవరానికి గురి చేసింది. నిజంగానే అతను చైనా పాలకుల వేధింపులు తట్టుకోలేక పరారయ్యారా లేక బీజింగ్‌ అధికారులే వ్యూహం ప్రకారం పంపించారా అనే విషయమై ఆరా తీస్తున్నారు. ఆ వ్యక్తి తన పేరు రువాన్‌(60) అని, చైనా నేవీలో కెప్టెన్‌గా పని చేశానని, ప్రభుత్వ విధానాలను విమర్శించడంతో వేధింపులకు గురయ్యానని తెలిపారు. చైనా తీర నగరం ఫుజౌ నుంచి సముద్ర మార్గంలో స్పీడ్‌ బోట్‌లో ప్రయాణిస్తూ వచ్చిన అతను ఆదివారంనాడు తైపీ నగరానికి 11 కి.మీ.దూరంలో ఒక నదిలో వంతెన వద్ద భద్రతా సిబ్బందికి పట్టుబడ్డారు. తమ భూభాగంలోకి రువాన్‌ వచ్చే దాకా భద్రతా సిబ్బంది ఎందుకు గుర్తించలేకపోయారో, ఆ లోపం ఎలా తలెత్తిందోనని తైవాన్‌ కోస్ట్‌గార్డ్‌ విభాగ అధికారులు దర్యాప్తు చేపట్టారు. చైనా అధికారులు ఉద్దేశపూర్వకంగానే కొన్ని సార్లు ఇలాంటి ఎత్తుగడలు వేస్తుంటారనే అనుమానాన్ని తైవాన్‌ రక్షణ మంత్రి విల్లింగ్టన్‌ కూ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు