కాంగోలో పడవ మునిగి 86 మంది మృతి

కాంగో రాజధాని నగరమైన కిన్‌షాసా సమీపంలోని క్వా నదిలో 271 మంది ప్రయాణికులతో వెళుతున్న పడవ మునిగి, 86 మంది మృతిచెందారు.

Published : 13 Jun 2024 03:38 IST

కిన్‌షాసా: కాంగో రాజధాని నగరమైన కిన్‌షాసా సమీపంలోని క్వా నదిలో 271 మంది ప్రయాణికులతో వెళుతున్న పడవ మునిగి, 86 మంది మృతిచెందారు. మిగతా 185 మంది ఈదుకొంటూ తీరానికి చేరుకున్నారు. సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు కాంగో దేశాధ్యక్షుడు ఫెలిక్స్‌ తిషిసెకెడి స్వయంగా ప్రకటించారు. పడవ నది ఒడ్డును ఢీకొని విరిగిపోయినట్లు తెలిపారు. ఓవర్‌ లోడింగుతో ప్రయాణికులను తరలించే పడవలు తరచూ ప్రమాదాలకు గురవటం ఈ ప్రాంతంలో సర్వసాధారణంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని