నోబెల్‌ గ్రహీత యూనస్‌పై బంగ్లాలో అభియోగం దాఖలు

నోబెల్‌ బహుమతి గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ (83), మరో 13 మంది కలిసి ఒక టెలికం కంపెనీ ఉద్యోగుల డివిడెండ్ల నుంచి 20 లక్షల డాలర్లకు పైగా స్వాహా చేశారని ఢాకాలోని ప్రత్యేక న్యాయస్థానంలో బుధవారం అభియోగం దాఖలైంది.

Published : 13 Jun 2024 06:03 IST

125 మంది పురస్కార గ్రహీతల ఆందోళన

ఢాకా: నోబెల్‌ బహుమతి గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ (83), మరో 13 మంది కలిసి ఒక టెలికం కంపెనీ ఉద్యోగుల డివిడెండ్ల నుంచి 20 లక్షల డాలర్లకు పైగా స్వాహా చేశారని ఢాకాలోని ప్రత్యేక న్యాయస్థానంలో బుధవారం అభియోగం దాఖలైంది. ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నందువల్ల జులై 15 నుంచి విచారణ మొదలుపెడతామని ప్రత్యేక న్యాయమూర్తి సయ్యద్‌ అరాఫత్‌ హుసేన్‌ ప్రకటించారు. ఆరోపణలను కొట్టివేయాల్సిందిగా యూనస్‌ ప్రభృతులు చేసిన విజ్ఞప్తిని ఆయన తోసిపుచ్చారు. యూనస్‌పై 150కి పైగా కేసులు ఉన్నాయి. అవినీతికి సంబంధించినవీ వాటిలో ఉన్నాయి. కార్మిక చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణపై జనవరిలో ఆయనకు ఆరు నెలల జైలు శిక్షపడింది. సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకున్న తరవాత బెయిలు లభించింది. యూనస్‌కు న్యాయపరంగా వేధింపులు ఆగకపోవడం, ఆయన్ను జైలు పాల్జేసే అవకాశం ఉండటంపై 241 మంది ప్రపంచ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. వీరిలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతోపాటు 125 మంది నోబెల్‌ గ్రహీతలూ ఉన్నారు. వీరంతా బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనాకు బహిరంగ లేఖ రాశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని