కాల్పుల విరమణపై కుదరని ఏకాభిప్రాయం

కాల్పుల విరమణ విషయంలో ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు.

Published : 13 Jun 2024 03:39 IST

జెరూసలెం: కాల్పుల విరమణ విషయంలో ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. టెల్‌ అవీవ్‌ తాత్కాలిక విరమణకు మొగ్గు చూపుతుంటే, హమాస్‌ శాశ్వత విరమణ కచ్చితంగా పాటిస్తేనే ఒప్పందానికి అంగీకరిస్తామంటోంది. ఇజ్రాయెల్‌ గత నెలలో ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందానికి మంగళవారం రాత్రి హమాస్‌ పలు సవరణలు సూచించింది. తాము చెప్పిన మార్పులు చేస్తేనే ఒప్పందానికి అంగీకరిస్తామని తెలిపింది. ముఖ్యంగా శాశ్వత కాల్పుల విరమణపై పలు సూచనలు చేసింది. హమాస్‌ స్పందనపై పశ్చిమాసియా పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని