ఉద్యోగినులతో ‘మస్క్‌’ లైంగిక సంబంధం

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌పై మరోసారి సంచలన కథనం ప్రచురితమైంది. తన సంస్థ స్పేస్‌ఎక్స్‌లో పని చేసే పలువురు మహిళా ఉద్యోగినులతో ఆయన లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు తాజా నివేదిక పేర్కొంది.

Published : 13 Jun 2024 06:04 IST

 వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ సంచలన కథనం

 ఇంటర్నెట్‌ డెస్క్‌: టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌పై మరోసారి సంచలన కథనం ప్రచురితమైంది. తన సంస్థ స్పేస్‌ఎక్స్‌లో పని చేసే పలువురు మహిళా ఉద్యోగినులతో ఆయన లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు తాజా నివేదిక పేర్కొంది. ఇంటర్న్‌షిప్‌ కోసం వచ్చిన ఓ యువతి కూడా అందులో ఉన్నట్లు తెలిపింది. మస్క్‌ తన కంపెనీలో మహిళలకు అసౌకర్య వాతావరణాన్ని కల్పించారంటూ ‘ది వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ తాజా కథనంలో ఆరోపించింది.  గతంలో ఎలాన్‌ మస్క్‌ కంపెనీలో పనిచేసి వెళ్లిపోయిన మహిళల నుంచి వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఈ వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. మస్క్‌కు డ్రగ్స్‌ తీసుకునే అలవాటు ఉందని, అప్పుడప్పుడు బోర్డ్‌ సభ్యులతో కలిసి వాటిని తీసుకునేవారని పేర్కొంది. ఈ క్రమంలోనే మహిళా ఉద్యోగులతో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు తెలిపింది. తన పిల్లలకు తల్లి కావాలని ఓ ఉద్యోగినిని ఆయన కోరినట్లు వెల్లడించింది. తనతో గడిపితే గుర్రాన్ని బహుమతిగా ఇస్తానని 2016లో మస్క్‌ చెప్పినట్లు మరో మహిళ వివరించినట్లు తాజా కథనం పేర్కొంది. స్పేస్‌ఎక్స్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ గ్విన్‌ స్పందిస్తూ మస్క్‌పై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు. ‘‘ఎలాన్‌ మస్క్‌పై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసేందుకే ఈ కథనాన్ని ప్రచురించారు. అదంతా అబద్ధం. అందర్నీ తప్పుదారి పట్టించేందుకు చేసే ప్రయత్నం. నాకు పరిచయమున్న వారిలోకెల్లా మస్క్‌ ఎంతో మంచి వ్యక్తి. ఆయన గురించి వస్తున్న కథనాలను చూసి ఆశ్చర్యపోతున్నా’’ అని పేర్కొన్నారు.  గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్‌ భార్య నికోల్‌ షానన్‌తో మస్క్‌ వివాహేతర సంబంధం సాగించారని ఇటీవల న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు