ఉత్తర ఇజ్రాయెల్‌పై 215 రాకెట్లు

ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. మంగళవారం రాత్రి హెజ్‌బొల్లా సీనియర్‌ కమాండర్‌ తలెబ్‌ అబ్దుల్లా(55)ను దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ వైమానిక దాడి చేసి హతమార్చింది.

Published : 13 Jun 2024 06:03 IST

 భారీస్థాయిలో హెజ్‌బొల్లా దాడులు

టెల్‌అవీవ్‌: ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. మంగళవారం రాత్రి హెజ్‌బొల్లా సీనియర్‌ కమాండర్‌ తలెబ్‌ అబ్దుల్లా(55)ను దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ వైమానిక దాడి చేసి హతమార్చింది. దీంతో బుధవారం ఉత్తర ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా 215 రాకెట్లతో విరుచుకుపడింది. గాజాలో పోరు ప్రారంభమైన తర్వాత ఈ మిలిటెంట్‌ సంస్థ ఈ స్థాయిలో దాడిచేయడం ఇదే తొలిసారి. చాలా రాకెట్లను కూల్చివేశామని ఇజ్రాయెల్‌ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని