తుర్కియేలో నిరుటి భూకంపాలకు ముందు అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు

నిరుడు ఫిబ్రవరిలో తుర్కియేను రెండు భారీ భూకంపాలు కుదిపేయడానికి 12-19 రోజుల ముందు ఆ దేశంలో భూతల ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయిలో నమోదైనట్లు పరిశోధకులు గుర్తించారు.

Published : 14 Jun 2024 04:52 IST

దిల్లీ: నిరుడు ఫిబ్రవరిలో తుర్కియేను రెండు భారీ భూకంపాలు కుదిపేయడానికి 12-19 రోజుల ముందు ఆ దేశంలో భూతల ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయిలో నమోదైనట్లు పరిశోధకులు గుర్తించారు. ఆ సమయంలో గ్రీన్‌హౌజ్‌ వాయువుల స్థాయులూ ఎక్కువగా ఉన్నాయని తేల్చారు. రిక్టర్‌ స్కేలుపై 7.6 తీవ్రతతో.. 9 గంటల వ్యవధిలో వచ్చిన రెండు భూకంపాలు గతేడాది ఫిబ్రవరిలో తుర్కియే, సిరియాల్లో పెను విధ్వంసం సృష్టించాయి. 50 వేలమందికి పైగా ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఆ ప్రకృతి విపత్తుల రాకకు ముందు ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తేల్చేందుకు ఇరాన్‌లోని టెహ్రాన్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఓ అధ్యయనాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా- 2022 నవంబరు 1 నుంచి 2023 ఫిబ్రవరి 10 వరకు తుర్కియేలో వాతావరణ పరిస్థితులను ఉపగ్రహాల డేటా ఆధారంగా విశ్లేషించారు. భూకంపాల రాకకు 5-10 రోజుల ముందు నీటిఆవిరి, మీథేన్, ఓజోన్, కార్బన్‌ మోనాక్సైడ్‌ స్థాయులు ఎక్కువగా కనిపించాయని నిర్ధారించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని