అమెరికా ఎన్నికల్లో జోక్యానికి ప్రత్యర్థి దేశాల ప్రయత్నాలు

అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసేందుకు పెద్దఎత్తున తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా ప్రత్యర్థి దేశాలు ప్రయత్నిస్తున్నాయని అగ్రరాజ్య నిఘా విభాగాధికారులు వెల్లడించారు.

Published : 14 Jun 2024 04:53 IST

నిఘా కార్యాలయం అధికారి వెల్లడి

వాషింగ్టన్‌: అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసేందుకు పెద్దఎత్తున తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా ప్రత్యర్థి దేశాలు ప్రయత్నిస్తున్నాయని అగ్రరాజ్య నిఘా విభాగాధికారులు వెల్లడించారు. దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిందిగా పలువురు అభ్యర్థులకు, రాజకీయ నాయకులకు పలుమార్లు హెచ్చరికలు పంపించినట్లు తెలిపారు. అధ్యక్ష ఎన్నికలపై ప్రత్యర్థి దేశాలు ఎక్కువగా దృష్టి సారించడమే ఈ పరిణామానికి కారణమని జాతీయ నిఘా కార్యాలయానికి చెందిన ఓ అధికారి తెలిపారు. ఎన్నికల్లో జోక్యానికి జరుగుతున్న ప్రయత్నాలను పసిగట్టే సామర్థ్యం ప్రభుత్వానికి పెరగడం కూడా దీనికి కారణమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఒక అంశంపై ప్రచారాన్ని ప్రారంభించి, దానిపై చర్చ జరిగేలా చేయడం, కొందరు అభ్యర్థుల గురించి అసత్యాలను ప్రచారంలోకి తీసుకురావడం మొదలైనవాటిని ఎన్నికల ప్రక్రియలో జోక్యంగా భావిస్తున్నారు. అమెరికా ఎన్నికల ప్రక్రియలో రష్యా, చైనా, ఇరాన్‌ వంటి దేశాలు జోక్యం చేసుకుంటున్నాయని రిపబ్లికన్లు, డెమోక్రట్లు ఇప్పటికే ఆందోళన వెలిబుచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు