ఇటలీ పార్లమెంట్‌లో ముష్టిఘాతాలు

ఇటలీ పార్లమెంట్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిని విస్తరించే ప్రభుత్వ వివాదాస్పద ప్రతిపాదనలు దిగువ సభలో చట్టసభ్యుల మధ్య ముష్టిఘాతాలకు  దారితీశాయి.

Published : 14 Jun 2024 04:53 IST

రోమ్‌: ఇటలీ పార్లమెంట్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిని విస్తరించే ప్రభుత్వ వివాదాస్పద ప్రతిపాదనలు దిగువ సభలో చట్టసభ్యుల మధ్య ముష్టిఘాతాలకు  దారితీశాయి. ఈ ఘటనలో గాయపడ్డ ఓ ప్రతిపక్ష సభ్యుడిని ఆసుపత్రికి తరలించినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. వివాదాస్పద ప్రతిపాదనలను వ్యతిరేకించిన ప్రతిపక్ష సభ్యుడు లియోనార్డో డాన్నో ఆ దేశ జెండాను సభలో మంత్రికి ఇవ్వడానికి ప్రయత్నించిన అనంతరం ఆయన్ను ఇతర సభ్యులు చుట్టుముట్టడం బుధవారం విడుదలైన వీడియోలో కనిపించింది. ఈ నేపథ్యంలో గాయపడ్డ డాన్నోని ఆసుపత్రికి తరలించినట్లు మీడియా పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని