పాత పేపర్ల కట్టలో చైనా సైనిక రహస్యాలు

సైనిక చరిత్రకు సంబంధించిన పుస్తకాలను ఆసక్తితో చదివే ఓ చైనా వ్యక్తికి అనూహ్య పరిణామం ఎదురైంది.

Published : 14 Jun 2024 04:54 IST

తైపీ: సైనిక చరిత్రకు సంబంధించిన పుస్తకాలను ఆసక్తితో చదివే ఓ చైనా వ్యక్తికి అనూహ్య పరిణామం ఎదురైంది. తాను ఒక డాలరు కన్నా తక్కువ నగదుతో కొనుగోలు చేసిన పాత పేపర్ల కట్టలో ఆ దేశ సైనిక రహస్యాలు లభ్యమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన అతడు.. అందులో ఉన్న సున్నిత అంశాల దృష్ట్యా వాటిని భద్రతా దళాలకు అందించాడు. అయితే, ఆ దస్త్రాల్లో ఎటువంటి విషయాలు ఉన్నాయి? అవి ఎప్పటివనేది మాత్రం వెల్లడించలేదు. దీనిపై దర్యాప్తు మొదలుపెట్టిన అధికారులు.. పాత పుస్తకాలు, మ్యాగజైన్లు విక్రయించే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రభుత్వ రహస్యాలకు సంబంధించిన సమాచారాన్ని బహిరంగ పరచడాన్ని చైనా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని