విధ్వంసం కేసులో నిర్దోషిగా ఇమ్రాన్‌ఖాన్‌

జైలుశిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ (72)కు గురువారం ఇస్లామాబాద్‌ కోర్టులో భారీ ఊరట లభించింది.

Published : 14 Jun 2024 04:56 IST

ఇస్లామాబాద్‌: జైలుశిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ (72)కు గురువారం ఇస్లామాబాద్‌ కోర్టులో భారీ ఊరట లభించింది. ఇమ్రాన్‌తోపాటు ఆయన సహాయకుడైన షా మెహమూద్‌ ఖురేషి, మాజీ మంత్రి షేక్‌ రషీద్‌లను ఈ కేసులో నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. ఇమ్రాన్‌ బృందం ‘ఆజాదీ మార్చ్‌’ పేరిట 144 సెక్షన్‌ నిబంధనలను ఉల్లంఘించి విధ్వంసానికి పాల్పడినట్లు 2022 మే నెలలో ఇస్లామాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పై ముగ్గురు నేతలతోపాటు పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ పార్టీకి చెందిన మరో ఇద్దరు నాయకులను ఈ కేసులో  నిర్దోషులుగా ప్రకటిస్తూ జుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ మాలిక్‌ మహమ్మద్‌ ఇమ్రాన్‌ తీర్పు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని