దీర్ఘకాల నొప్పికి కొత్త చికిత్సా విధానం

పెద్దలను దీర్ఘకాలంగా పీడించే నొప్పిని తగ్గించడానికి సరికొత్త మానసిక చికిత్సా విధానం రూపొందింది. 2000 సంవత్సరం నుంచి ప్రయోగ దశలో ఉన్న ఈ విధానాన్ని భావోద్వేగ స్పృహ, అభివ్యక్తి చికిత్స (ఈఏఇటి)గా వ్యవహరిస్తున్నారు.

Published : 15 Jun 2024 05:13 IST

దిల్లీ: పెద్దలను దీర్ఘకాలంగా పీడించే నొప్పిని తగ్గించడానికి సరికొత్త మానసిక చికిత్సా విధానం రూపొందింది. 2000 సంవత్సరం నుంచి ప్రయోగ దశలో ఉన్న ఈ విధానాన్ని భావోద్వేగ స్పృహ, అభివ్యక్తి చికిత్స (ఈఏఇటి)గా వ్యవహరిస్తున్నారు. తీవ్ర అలసటను, శరీరమంతటా కండరాల నొప్పిని కలిగించే ఫైబ్రోమయాల్జియా వ్యాధితోపాటు కీళ్ల నొప్పుల (ఆర్థరైటిస్‌) వల్ల పెద్ద వయసు వారు దీర్ఘకాల నొప్పికి లోనవుతారు. తీవ్ర మనో విఘాతానికి లోనైన వారికీ ఇలాంటి సమస్య ఎదురవుతుంది. వారి ఆలోచనలను, నడతను, వైఖరులను మార్చడం ద్వారా నొప్పిని తగ్గించడానికి కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరపీ (సీబీటీ)ని వినియోగిస్తారు. అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు 60 నుంచి 95 ఏళ్ల వయసులోని 120 మంది మహిళలు, పురుషుల దీర్ఘకాల రుగ్మతను తగ్గించడానికి ఈఏఇటీ¨, సీబీటీ చికిత్సా పద్ధతులను ప్రయోగాత్మకంగా వినియోగించారు. వీరిలో ఈఏఇటీ చికిత్సను పొందిన వయోధికులలో 63 శాతం మందికి 30 శాతం నొప్పి తగ్గగా, సీబీటీ చికిత్స వల్ల 17 శాతం మందికే ఉపశమనం లభించింది. ఈఏఇటీ చికిత్స వల్ల ఆదుర్దా, మానసిక కుంగుబాటు కూడా తగ్గాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని