హజ్‌ యాత్ర ప్రారంభం

ఎడారి ఉష్ణోగ్రతల ఉక్కపోత నడుమ శుక్రవారం ముస్లింల వార్షిక హజ్‌ యాత్ర కార్యక్రమం ప్రారంభమైంది. ఇస్లాం మతస్థులు అతి పవిత్రమైనదిగా భావించే దివ్య మసీదులోని కాబా చుట్టూ ప్రదక్షిణలతో ఈ యాత్ర మొదలైంది.

Published : 15 Jun 2024 05:23 IST

మక్కాలో యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన గుడారాలు

మీనా (సౌదీ అరేబియా): ఎడారి ఉష్ణోగ్రతల ఉక్కపోత నడుమ శుక్రవారం ముస్లింల వార్షిక హజ్‌ యాత్ర కార్యక్రమం ప్రారంభమైంది. ఇస్లాం మతస్థులు అతి పవిత్రమైనదిగా భావించే దివ్య మసీదులోని కాబా చుట్టూ ప్రదక్షిణలతో ఈ యాత్ర మొదలైంది. మీనా నుంచి వీరంతా శనివారం అరాఫత్‌ పర్వతానికి చేరుకుంటారు. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశముందని సౌదీ ఆరోగ్య మంత్రిత్వశాఖ పలు సూచనలు జారీ చేసింది. ఈదుల్‌ అధా (బక్రీద్‌) నాటికి వీరంతా తిరిగి మీనాలో ఉంటారు. ప్రపంచం నలుమూలల నుంచి వివిధ దేశాలకు చెందిన 15 లక్షలకు పైగా భక్తులు హజ్‌ యాత్రకు తరలివచ్చారు. వీరికి స్థానికులు కూడా తోడవటంతో ఈ ఏడాది యాత్రికుల సంఖ్య 20 లక్షలు దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ల నడుమ గాజా భూభాగంలో ఉద్ధృతంగా సాగుతున్న యుద్ధ నేపథ్యంలో ఈ ఏడాది హజ్‌ యాత్ర రావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని