ట్రంప్‌ ప్రభుత్వం విధించిన నిషేధం చెల్లదు

డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తుపాకీ ఉపకరణాల్లో ఒకటైన బంప్‌స్టాక్స్‌పై విధించిన నిషేధాన్ని శుక్రవారం అమెరికా సుప్రీంకోర్టు ఎత్తివేసింది.

Published : 15 Jun 2024 05:46 IST

‘బంప్‌స్టాక్స్‌’పై అమెరికా సుప్రీంకోర్టు తీర్పు

వాషింగ్టన్‌: డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తుపాకీ ఉపకరణాల్లో ఒకటైన బంప్‌స్టాక్స్‌పై విధించిన నిషేధాన్ని శుక్రవారం అమెరికా సుప్రీంకోర్టు ఎత్తివేసింది. సెమీ ఆటోమేటిక్‌ తుపాకీకి బంప్‌స్టాక్స్‌ను అమరిస్తే.. మెషిన్‌గన్‌లా వాడే వీలుంటుంది. 2017లో లాస్‌వెగాస్‌లో జరిగిన ఓ సంగీత ఉత్సవంపై ఓ గన్‌మన్‌ బంప్‌స్టాక్స్‌ అమర్చిన తుపాకీతో కాల్పులు జరిపాడు. 11 నిమిషాల్లో 1000 రౌండ్లు కాల్చాడు. 60 మంది చనిపోయారు. దీంతో 2018లో బంప్‌స్టాక్స్‌పై ట్రంప్‌ ప్రభుత్వం నిషేధించింది. దీన్ని టెక్సాస్‌కు చెందిన వ్యక్తి సవాల్‌ చేశారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. మెషిన్‌గన్ల నిషేధం కోసం వందేళ్లక్రితం రూపొందించిన చట్టం పరిధిలోకి బంప్‌స్టాక్స్‌ రావని.. కాబట్టి నిషేధం చెల్లుబాటు కాదని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని