జాబిల్లి పరిశోధన కేంద్రం నిర్మాణంలో చైనాతో రష్యా భాగస్వామ్యం

అంతర్జాతీయ జాబిల్లి పరిశోధన కేంద్రాన్ని చైనా, రష్యా సంయుక్తంగా నిర్మించేందుకు తలపెట్టిన ప్రణాళికకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆమోదం తెలిపారు.

Published : 15 Jun 2024 05:46 IST

ప్రణాళికకు ఆమోదముద్ర వేసిన పుతిన్‌

బీజింగ్‌: అంతర్జాతీయ జాబిల్లి పరిశోధన కేంద్రాన్ని చైనా, రష్యా సంయుక్తంగా నిర్మించేందుకు తలపెట్టిన ప్రణాళికకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆమోదం తెలిపారు. ఈ మేరకు రష్యా అధికార సమాచార పోర్టల్‌ బుధవారం తెలిపినట్లు స్పుత్నిక్‌ న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది. ప్రతిష్ఠాత్మక అంతరిక్ష ప్రాజెక్టును ఏప్రిల్‌లో ఈ రెండు దేశాలు ప్రకటించాయి. ఆ ప్రకారం ఈ ప్రాజెక్టును చంద్రుడి ఉపరితలంపైనా, జాబిల్లి కక్ష్యలోనూ, భూమిపై రెండు దశల్లో నిర్మిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని