ప్రపంచ చరిత్రలో అతిపెద్ద కసరత్తు

భారత్‌లో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలను ప్రపంచంలో మరే దేశంతో పోల్చినా అతిపెద్ద ఎన్నికలుగా అమెరికా ప్రశంసించింది. ‘‘భారత్‌లో జరిగిన ఎన్నికలను మేము ఆస్వాదించాం.

Published : 15 Jun 2024 05:47 IST

భారత ఎన్నికలపై అమెరికా ప్రశంస

వాషింగ్టన్‌: భారత్‌లో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలను ప్రపంచంలో మరే దేశంతో పోల్చినా అతిపెద్ద ఎన్నికలుగా అమెరికా ప్రశంసించింది. ‘‘భారత్‌లో జరిగిన ఎన్నికలను మేము ఆస్వాదించాం. చరిత్రలో ఇది అతిపెద్ద కసరత్తు’’ అని అక్కడి విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ మీడియాకు వెల్లడించారు. అధికార పార్టీ భాజపాలో ముస్లిం సభ్యుల ప్రాతినిధ్యం ఏమాత్రం లేకపోవడంపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. అది భారత ప్రజలే నిర్ణయించుకోవాల్సిన అంశమని పేర్కొన్నారు. భారత ఎన్నికల ఫలితాలపై తాను వ్యాఖ్యలు చేయడం లేదని మిల్లర్‌ స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని